Sonia, Rahul attack TRS for "family rule" కేసీఆర్ కుటుంబపాలనపై రాహుల్ ఫైర్

Kcr worked only for himself and people close to him sonia gandhi

sonia gandhi, telanagana, rahul gandhi, telangana election, k chandrasekhar rao, channdrababu naidu, medchal public meeting, andhra pradesh, trs, mnrega scheme, telugu desam party, telangana jana samithi, gaddar, mahakootami, kondandaram, Telangana politics

Sonia Gandhi complained that KCR government has ignored farmers in the state by not following the implementation of Land Acquisition Act.

ITEMVIDEOS: మనం కలలుగన్న తెలంగాణ ఇది కాదు: మేడ్చల్ సభలో సోనియా, రాహుల్

Posted: 11/23/2018 09:31 PM IST
Kcr worked only for himself and people close to him sonia gandhi

తెలుగు రాష్ట్రం అభివృద్ది పథంలో నడుస్తున్న సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి రాష్ట్రాన్ని విడదీశామని యూపీఏ చైర్ పర్సెన్ సోనియాగాంధీ అన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా నష్టపోకూడదని పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ప్రకటించామన్నారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కూడా న్యాయం చేస్తామని వారికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని చెప్పారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చామని సోనియా గాంధీ అన్నారు.

తెలంగాణ ప్రజానికం రాష్ట్రా నీళ్లు, నిధులు, నియామాకాల కోసం పోరాడిందని, వారి పోరాటాన్ని గౌరవించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పటు చేశామని అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే అందోళన కలుగుతుందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్‌ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారాలు. అందరికీ కార్తీక పూర్ణిమ, గురు నానక్‌ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ ఒక తల్లి సంవత్సరాల తర్వాత సొంతబిడ్డల దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత సంతోష పడుతుందో నేను అలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నానన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కష్టతరమైన సమస్య అనిపించింది. అప్పుడు ఆంధ్ర్రా, తెలంగాణ ప్రజల బాగోగులు రెండూ నా కళ్ల ముందు ఉన్నాయన్నారు. అంత పెద్ద సమస్య అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆంకాక్షల, స్ఫూర్తి గుర్తించి వారి కలను సాకారం చేశాం. ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా మాకు నష్టం జరిగింది. అయినా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని ఆమె మరోమారు ఉద్ఘాటించారు.

‘ఆంధ్రా ప్రజల జీవితాలు బాగుపడాలని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు పార్లమెంట్‌లో ప్రకటన చేశామని. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అమె పునరుధ్ఘాటించారు. ప్రతి తల్లీ తన సంతానం బాగుపడాలని కోరుకుంటుంది. నేనూ అలాగే కోరుకున్నా. కానీ, మీ జీవితాలు, బతుకులు చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది. ఈ నాలుగున్నర సంవత్సరాల కేసీఆర్‌ పాలనలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం మీరు చేసిన పోరాటం తెరాస ప్రభుత్వం సాకారం చేసిందా?’’ వారి‌ కుటుంబానికి ఉపయోగ పడే పనులే చేసుకున్నారు‘‘ అని సోనియాగాంధీ అరోపించారు.

ఈ నాలుగున్నరేళ్లలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భూసేకరణ చట్టం అమలు చేయకుండా రైతులకు నష్టం చేసింది. కూలీలకు ఎంతో మేలు చేసే ఉపాధి హామీ చట్టాన్ని కూడా తెరా అమలు చేయలేదు. కేసీఆర్‌ కుటుంబం, బంధువులకు మాత్రమే ఉపయోగపడే పనులు చేసుకున్నారు. ఎన్నో కలలు, ఆశయాలతో తెలంగాణ ఇస్తే.. అవి సాకారం కాలేదు’’టీఆర్ఎస్ పాలన అంతం చేసే సమయం ఇదని అమె సభాస్థలి నుంచి తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

‘‘చిన్న పిల్లాడి పెంపకంలో లోపం ఉంటే అతడి భవిష్యత్‌ ఎలా నాశనం అవుంతుందో ఈ నాలుగున్నర పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టింది. భవిష్యత్‌ అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికలతోనే తెలంగాణ ప్రజల భవిష్యత్‌ ముడి పడి ఉంది. తెరాస పాలన అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా.’’ అంటూ తెరాస పాలనపై సోనియా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఆ తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్టాడుతూ.. తెలంగాణలో నాలుగున్నరేళ్లు తిష్టవేసుకుని కూర్చున రాక్షస రాజ్యాన్ని కూల్చేందుకే అంతా కలిసి జట్టు కట్టి మహాకూటమిగా ఏర్పడ్డామని అన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై సోనియాగాంధీకి ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజల కోరికలు సఫలీకృతం కావాలనే ఆమె అండగా నిలిచారన్నారు. అన్ని వర్గాల ప్రజలు రక్తమోడ్చి పోరాడితేనే తెలంగాణ కల సాకారమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా ఇక్కడికి వచ్చి తన ప్రజల పట్ల తన ఆకాంక్షను చాటారన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాటాలు చేస్తున్నప్పుడు సోనియా ప్రజల పక్షాన నిలబడ్డారని చెప్పారు.

తెలంగాణ ప్రజలు రక్తమోడ్చి, చమటోడ్చి పోరాడితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఏర్పాటులో ప్రజల పోరాటాలతో పాటు సోనియా పాత్ర కూడా అనిర్వచనీయమైందని గర్వంగా చెబుతున్నానన్నారు. తెలంగాణలో నాలుగున్నరేళ్ల తెరాస రాక్షస పాలనకు చరమగీతం పాడబోతున్నామన్నారు. రాక్షస రాజ్యాన్ని నిర్మూలించేందుకు కాంగ్రెస్‌తో పాటు తెదేపా, సీపీఐ, తెజస అన్నీ కలిసి వచ్చాయన్నారు. తమ ప్రజాఫ్రంట్‌లో విద్యార్థులు, రైతులు, మహిళల ఆకాంక్షలు కనబడుతున్నాయని చెప్పారు.

ఏ కలల కోసం ప్రజలు కొట్లాడారో ఆ కలలను సాకారం చేయడమే తమ కూటమి లక్ష్యమన్నారు. ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ సాధించుకున్నారో అవి నెరవేరలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల అందరికీ మేలు జరుగుతుందని భావిస్తే.. ఒకే కుటుంబం లాభపడిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేసింది కాదన్నారు. లక్షలాది నిరుద్యోగుల కష్టాలు తీర్చేందుకే మహాకూటమి ఏర్పాటైందని చెప్పారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రజా కూటమి పాలన ఉంటుందని రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles