pawan fires on ruling and opposition parties చంద్రబాబు, జగన్ లపై పవన్ ఫైర్..!

Pawan kalyan asks to choose the best cm among the three

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan east godavari yatra, Pawan Kalyan kostandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan asks voters to choose the best person as chief minister of Andhra Pradesh among the three from TDP, YCP and Janasena

ముగ్గురిలో ఎవరు మీకు ముఖ్యమంత్రిగా కావాలి.?: పవన్

Posted: 11/23/2018 06:30 PM IST
Pawan kalyan asks to choose the best cm among the three

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలనుకనే ముగ్గురు వ్యక్తులు మీ ముందు ఉన్నారని వారిలో ఎవరు మీకు నిజంగా నిస్వార్థంగా, నిజాయితీగా, పారదర్శకంగా పాలనను అందించగలని మీకు భావిస్తు్న్నారో తేల్చుకోవాలని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూచించారు. ఇక ముగ్గురిలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు.. శక్తి సన్నగిల్లి, కొడుకు మీద మక్కువతో వ్యవస్థను చెప్పుచేతల్లోకి తీసుకున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తి వారసుడు.. సత్తా, సమర్థతలేని లోకేష్ సీఎం కావాలా? అని ప్రశ్నించారు.

ఇక ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వం తప్పిదాలను నియంత్రిచాల్సింది బాద్యతను తమ భజస్కంధాలపై వున్నా.. వాటిని పట్టించుకోకుండా చట్టసభల నుంచి పారిపోయిన వ్యక్తికి పాలనా పగ్గాలను ఎలా అందిస్తారని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి కావాలన్నదే ధ్యేయంగా పెట్టుకుని.. ప్రజలు అనుభవిస్తున్న బాధలను, కష్టాలను, నష్టాలను వారికే వదిలేసే బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్ష నేతకు పాలనాపగ్గాలను ఇచ్చినా ప్రజలకు ఏం లాభం కలుగుతుందని ఆయన నిలదీశారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన జగన్.. పారిపోయి రోడ్లపై తిరుగుతున్నారని.. ఆయన సీఎం కావాలా అని ప్రశ్నించారు.

కేవలం ప్రజాసేవ చేయడానికి నిస్వార్థంగా ముందకు వచ్చిన పవన్ కల్యాన్ కావాలా.? అంటూ అడిగారు. లాభాపేక్ష లేకపోవడంతో పాటు ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయాన్ని వదులుకొని ప్రజలకు పారదర్శక పాలనను అందించాలని, ప్రభుత్వాలకు జవాబుదారి తనం వుండాలని భావించే తాను రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కావాలా? ఎవరు కావాలి సీఎం? ముగ్గురిలో ఎవరు నిజంగా మీ సమస్యలను దూరం చేస్తారని భావిస్తున్నారు. ఎవరు ఆర్థుల కష్టాలను తీర్చి ఆదుకుంటారని భావిస్తున్నారని పవన్ ప్రశ్నించారు.

ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాలపై వాటి అధినేతలపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్.. అధికారంలో టీడీపీ.. ప్రతిపక్షంలో వైసీపీ రెండు విఫలమయ్యాయని విమర్శించారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సమస్యలపై పోరాడటానికి ఒక ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని పవన్ తప్పుబట్టారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతే, అసెంబ్లీకి వెళ్లడం చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్మోహన్ రెడ్డి స్థానంలో తానుంటే ఎమ్మెల్యేలు మొత్తం అమ్ముడుపోయినా తాను ఒక్కడినే అయినా అసెంబ్లీకి వెళ్లే వాడినని పవన్ మండిపడ్డారు.తన కాన్వాయ్‌‌లోని ఒక వాహనాన్ని ఇటీవల ఇసుక లారీని ఢీకొట్టిన సంఘటనను పవన్ గుర్తుచేస్తూ.. ‘ఐదు రోజుల క్రితం రాజానగరం నుంచి వస్తుంటే ఒక ఇసుక లారీ వచ్చి మన కాన్వాయ్‌ను గుద్దేసింది. నా కారును దాటి నన్ను కాపాడే అంగరక్షకుల కారును ఢీకొట్టింది. 8 మందికి గాయాలయ్యాయి. అదే రోజున హైదరాబాద్‌లో దిగి ఇంటికి వెళ్తుంటే మనోహర్ గారి కారును మరో ఇసుక లారీ గుద్దేసిందని గుర్తు చేశారు.

జగన్ మాదిరిగా దీని మీద ఎందుకు గోల చేయలేదు. ఒక కోడి కత్తి భుజం మీద గుచ్చితే గుచ్చారో.. గుచ్చారో.. అని గోల చేశారు. దమ్ముంటే బయటికొచ్చి పోరాటాలు చేయండి. ఆ ధైర్యం లేదు మీకు. మా ప్రమాదాన్ని మేం రాజకీయం చేయలేదు. పోలీసులకు వదిలేశాం’ అని జగన్‌పై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేనివారని, అవినీతి లేని పాలనను అందించలేనివారని పవన్ వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పాలన వీరివల్ల కాదని అన్నారు. కానీ, 2019లో జనసేన అధికారంలోకి వస్తే అవినీతిలేని పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles