Ambareesh Last rites to be performed at Kanteerava Studios అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టూడియోకు అంబరీష్ బౌతికకాయం..

Ambareesh last rites to be performed at kanteerava studios

ambareesh, ambareesh funeral, actor ambareesh, ambareesh news, ambareesh death, ambareesh dead, kannada actor ambareesh, ambrish, ambarish death, ambareesh latest news, ambreesh, sandal wood rebel star, ambareesh last rites, funeral, kanteerava studios, raj kumar, bengaluru, sandal wood

The last rites of Ambareesh will be conducted near Dr Rajkumar Smaraka at Kanteerava Studio, Bengaluru, with state honours on November 26. From there the body will be transported to Kanteerava stadium.

అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టూడియోకు అంబరీష్ బౌతికకాయం..

Posted: 11/26/2018 11:08 AM IST
Ambareesh last rites to be performed at kanteerava studios

కన్నడ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి అంబరీష్ అంత్యక్రియలు ఇవాళ బెంగళూరు కంఠీరవ స్టూడియోలో జరగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది. అధికార లాంఛనాల నడుమ అంబరీష్ అంత్యక్రియులు బెంగుళూరులోని  రాజ్ కుమార్ స్మారకం పక్కనే నిర్వహించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే.  అభిమానులు, ప్రజల సందర్శనార్థం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో అంబరీష్ మృతదేహాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

అంబరీష్ అంత్యక్రియల విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అభిమానులు నమ్మవద్దని అంబరీష్ కుటుంబ సభ్యులు కోరారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. జేపీనగర్ లోని ఆయన నివాసంలో ఉన్న ఆయన పార్థీవదేహాన్ని.. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల కడసారి చూపుకోసం కంఠీరవ స్టూడియోకు పార్థీవదేహాన్ని తరలించారు. ఇక ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

అంబరీష్ కర్ణాటకలోని మాండ్య జిల్లాలో జన్మించారు. మండ్య నుంచి మూడు సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ప్రజలకు దగ్గర అయ్యారు. అంతకుముందే రెబల్ స్టార్‌గా మాండ్య ప్రజలకు అత్యంత సన్నిహితుడు అయ్యారు. అంబరీష్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన్ను చివరిసారి చూసేందుకు బెంగళూరు వస్తున్న మాండ్య జిల్లా ప్రజల కోసం అక్కడి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడుపుతోంది.

అంబరీష్‌ శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటి నుంచీ కర్ణాటక వ్యాప్తంగా అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. రజనీకాంత్‌, తెలుగు సినీ ప్రముఖుల్లో చిరంజీవి దంపతులు, మోహన్‌బాబు, కన్నడ సినీ ప్రముఖులు అంబరీష్ బౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. 208 సినిమాలలో నటించిన అంబరీష్‌ దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రజాసేవకే అంకితమయ్యారు. ఆయన తెలుగింటి అల్లుడు. ఆయన సతీమణి అలనాటి ప్రముఖ నటి సుమలత. వారి ఏకైక కుమారుడు అభిషేక్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ambareesh  last rites  funeral  kanteerava studios  raj kumar  bengaluru  sandal wood  

Other Articles