KCR conceded defeat, claims Uttam టీఆర్ఎస్ కు షాక్ తగలబోతోంది.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు..

Uttam kumar reddy says trs key leaders will join congress

TPCC president, Uttam kumar reddy, konda vishweshwar reddy, yadav reddy, TRS key leaders, KCR, defeat, Telangana, Politics

TPCC president N Uttam Kumar Reddy said another important leader of the TRS also was expected to join the Congress, but it was postponed by a day due to personal reasons.

టీఆర్ఎస్ కు షాక్ తగలబోతోంది.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు..

Posted: 11/23/2018 05:19 PM IST
Uttam kumar reddy says trs key leaders will join congress

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలబోతోందని... ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీ సంఖ్యలో వలసలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ లో చేరేందుకు టీఆర్ఎస్ కీలక నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు ఇచ్చిన మాటలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుపుకోలేదని ఉత్తమ్ అన్నారు. ముస్లింలు, గిరిజనులు, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగున్నాయని చెప్పారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మహాకూటమే అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. ఈ సాయంత్రం మేడ్చల్ లో జరగనున్న సభలో సోనియాగాంధీకి పౌరసన్మానం జరుగుతుందని... ఈ సభకు మహాకూటమి నేతలందరినీ ఆహ్వానించామని చెప్పారు.  

కేసీఆర్ ఇక రిటైర్మెంట్ ప్రకటించాలని, ఇందుకోసం ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నానని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లు వేసుకున్న ముసుగు తొలగిపోయిందని... దోచుకోవడానికే మళ్లీ అధికారంలోకి రావాలని వారు అనుకుంటున్న విషయం ప్రజలకు అర్థమైందని చెప్పారు. 30 రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూ. 50వేల గ్రాంట్ ను ఇస్తామని, ఆ తర్వాత ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles