will become king maker or king on december 11th: MIM

Will become king maker or king on december 11th mim

MIM king maker, Akbaruddin Owaisi, MIM, Owaisi, Telangana CM, TRS, Hyderabad, Telangana, politicsMIM king maker, Akbaruddin Owaisi, MIM, Owaisi, Telangana CM, TRS, Hyderabad, Telangana, politics

After the Results of Telangana Assembly polls on december 11th, we will become the king maker or King says MIM leader akbaruddin owassi.

కింగ్ మేకర్ లేదా కింగ్ మేమే: అక్బరుద్దీన్ ఒవైసీ

Posted: 11/23/2018 02:52 PM IST
Will become king maker or king on december 11th mim

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల బరిలో నిలిచాయి. ఈ లోగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రచారం కూడా నిర్వహిస్తున్నాయి. మరో అరడజను రోజు వ్యవధిలో రానున్న ఎన్నికలలో ప్రతీక్షణం అత్యంత విలువైనదేనని అభ్యర్థుల అనేక వ్యవప్రయాసలకు ఓర్చి మరీ శ్రమిస్తున్నారు. అయితే ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, మహాకూటమి మధ్య పోటీ తీవ్రంగానే వున్నా.. నగరంలో మాత్రం ఎంఐఎం. బీజేపి పార్టీలు క్రీయాశీలకంగా మారనున్నాయి.

అయితే డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికలతో ఈవీఎం యంత్రాలలో ప్రజాతీర్పు నిక్షిప్తమై వుంటుంది. కాగా డిసెంబర్ 11న జరిగే ఓట్ల లెక్కింపు తరువాత తామే రాష్ట్రంలో కింగ్ మేకర్ గా తయారవుతామని ఎంఐఎం పార్టీ ఆగ్ర నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ కలలు కంటున్నారు. ఔనా నిజమేనా అంటే ఇది ముమ్మాటికీ నిజమే. ఈ సారి ఎన్నికలలో గతం కంటే ఒకటి రెండు స్థానాలు అధికంగానే తమ ఖాతాలోకి వేసుకుంటామని ధీమాతో వున్నా ఆయన కర్ణాటక తరహా ఫలితాలు వస్తే పరిస్థితి తమకే అధికారం అందేలా కూడా వుంటుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడడంతో ఎంఐఎం కూడా అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతోంది. చంద్రాయణగుట్ట నియోయకవర్గంలోని రియసాత్ నగర్ లో ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, కేసీఆర్ ప్రతి ఒక్క సీఎంకు చెపుతున్నా.. డిసెంబర్ 11న అందరూ చూడండి ఏంజరుగుతుందో, ఆ రోజున నేనే కింగ్ మేకర్ అని అన్నారు.

అంతకుముందు కూడా హైదరాబాద్‌లో జరిగిన ఎంఐఎం కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్‌ ఓవైసి ఉద్రేకంగా మాట్లాడారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం కీలక పాత్ర నిర్వహించే అవకాశం ఏర్పడుతుందన్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు?. కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినపుడు.. తెలంగాణలో మేము (ఎంఐఎం) ఎందుకు సీఎం కాలేం? అని ఓవైసీ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MIM king maker  Akbaruddin Owaisi  MIM  Owaisi  Telangana CM  TRS  Hyderabad  Telangana  politics  

Other Articles