netizens critisize KCR ob his blackmail politics కేసీఆర్ నోట ‘నేనోడిపోతే..’ పాట.. విమర్శించిన నెట్ జనులు

Why kcr blackmails telangana voters during election campaign

TRS nirmal meeting, TRS on seemandhra people, KCR critisises Modi, KCR Blackmail politics, KCR blackmailing voters, KCR on Defeat in polls, KCR farm house, telangana elections KCR, KTR, Telangana Voters, seemandhra voters, TRS strategy, nirmal public meeting, telangana, politics

As part of the TRS strategy, TRS president and caretaker CM K Chandrasekhar Rao is critisizing the seemandhra settlers in telangana in other than hyderbad, rangareddy districts, while his son KTR is wooing settlers with road shows in GHMC limit.

కేటీఆర్ మైత్రిరాగం.. కేసీఆర్ ఖూనిరాగం.. ‘‘ఆంధ్రోళ్ల’’ అంటూ దెప్పిపోడుపు

Posted: 11/23/2018 01:35 PM IST
Why kcr blackmails telangana voters during election campaign

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహప్రతివ్యూహాలు ఆకట్టుకునేలా వుండగా, నిన్న నిర్మల్ వేదికగా ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలను మరోమారు కలవరానికి గురిచేస్తున్నాయి. ఓ వైపు సీమాంధ్ర ఓటర్లు తమ పార్టీ వైపునే వున్నారని.. వారే జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలుపును అందించారని అదే విజయాన్ని రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా అందించాలని మంత్రి కేటీఆర్ వారిని అభ్యర్థిస్తున్నారు.

ఇంతవరకు బాగానే వున్నా కేసీఆర్ వ్యవహరిస్తున్న వైఖరితో కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు భంగం వాటిల్లుతుంది. హైదరాబాదులోని సెట్లర్ల ఓట్లను తాను ఎంతో చాకచక్యంగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలోనే అటు కేసీఆర్ హైదరాబాదేతర జిల్లాలో పర్యటనల సందర్భంగా వారిని మరోమారు అంధ్రోళ్లు అంటూ ఊటంకిస్తూ దెప్పిపోడుస్తున్నారు. దీంతో సెట్లర్ల సమస్యను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా న్యాయం చేస్తామని చెబుతూ హామీలిస్తూ.. ఎంతో శ్రమించి తమ పార్టీ పక్షాన కేటీఆర్ మళ్లిస్తున్న ఓట్లను కాస్తా మళ్లీ గండిపడేట్లు చేస్తున్నారు కేసీఆర్. అదెలా అంటే..

రాస్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల వేడిని రాజేస్తున్న టీఆర్ఎస్ అధినేత.. ఆంధ్రోళ్లకు ఏం తెలుసు అన్న ఒక్క మాటతో హైదరాబాద్ సహా పరిసర జిల్లాలోని సెట్లర్ల ఓట్లను దూరం చేసుకుంటున్నారు. ఎల్లప్పుడూ తన చేతికి కట్టుకుని ఉండే 'దట్టీ' గురించి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న పలు ప్రచార సభల్లో పాల్గొన్న ఆయన, ముస్లిం సంప్రదాయంలో ఇమాన్ ఏ జామీన్ (క్షేమంగా వెళ్లి, లాభంగా రా) అంటూ చేతికి దట్టీ కడతారని చెబుతూ, ఆంధ్రోళ్లకు దీనిని ఎందుకు కట్టుకుంటారో, దీని వెనకున్న కథేంటో తెలియదని దెప్పిపొడిచారు.

తాను కట్టుకోవడం చూసి, చాలామంది కట్టుకుంటున్నారని, రేపెన్నడైనా తాను మెడకు దాన్ని కట్టుకుంటే, ఆంధ్రోళ్లు కూడా మెడకు కట్టుకుంటారని అన్నారు. ఆపై దట్టీ వెనకున్న ప్రాచీన గాధను వినిపిస్తూ, మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాన్ హుస్సేన్ ఈ దట్టీని తొలిసారిగా వాడారని చెప్పారు. "మక్కాలో ఓ కసాయి వ్యక్తి, జింకను పట్టుకుని చంపేందుకు ప్రయత్నిస్తుండగా, అది ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్లిన ఇమాన్ హుస్సేన్, ఆ  జింక ఎందుకు ఏడుస్తుందో తెలుసా? అని ప్రశ్నించాడు. ఆ జింక బిడ్డ పాల కోసం ఏడుస్తోందని, నువ్వు విడిచిపెడితే, అది వెళ్లి పాలిచ్చి వస్తుందని చెబుతాడు.

దీన్ని నమ్మని కసాయివాడు జింకను వదిలేందుకు నిరాకరించగా, ఆ జింకను వదిలేయాలని, అది రాకపోతే తనను కోసేయాలని చెబుతాడు. ఆశ్చర్యపోయిన కసాయి, జింకను వదిలిపెట్టగా, 'క్షేమంగా వెళ్లి... లాభంగా రా' అంటూ తన రుమాలును ఆ జింకకు కట్టాడు హుస్సేన్. ఆ జింక వెళ్లి, బిడ్డకు పాలిచ్చి తిరిగొచ్చింది. ఆపై కసాయి మనసు మారి, హుస్సేన్ కు నమస్కరించి, జింకను వదిలేశాడు" అంటూ ఇది చాలా పవిత్రమైనదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే కథ బాగానే వున్నా ఓటర్ల విషయంలో మాత్రం మరో వ్యూహం అలోచించి కథను విశ్లేషించి వుంటే బాగుండేదని రాజకీయ విశ్లేషకుల భావన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  KTR  Telangana Voters  seemandhra voters  TRS strategy  nirmal public meeting  telangana  politics  

Other Articles