JD Laxmi Narayana to float a new political party ఏపీలో రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ.. జేడీ రాణించగలడా..

Former ips officer jd laxmi narayana to float a new political party

JD Laxmi Narayana to float a new political party, Former IPS officer JD Laxmi Narayana political party, JD party focused on agriculture, Jd party focused on Health, JD party focused on Students, New Political Party, JD Lakshminaryana, cbi ex jd, YS Jagan, Andhra Pradesh

Former IPS officer JD Laxmi Narayana to float a new political party in Andhra pradesh says his party will be focused on refoms in agriculture, health and students

ఏపీలో రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ.. జేడీ రాణించగలడా..

Posted: 11/23/2018 12:10 PM IST
Former ips officer jd laxmi narayana to float a new political party

తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు. నవంబరు 26న తన పార్టీని ఆయన ప్రకటించనున్నారు. అదే రోజున పార్టీ జెండా, అజెండాల గురించి వివరించనున్నారు. వైసీపీ అధినేత జగన్‌, సత్యం కంప్యూటర్స్‌, గాలి జనార్దన్ రెడ్డిల అక్రమాల కేసులపై దర్యాప్తులతో లక్ష్మీనారాయణ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈ కేసుల విచారణలో ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

ఇటీవల మహారాష్ట్రలోని తన ఉన్నత పోలీసు అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఇక ప్రజాసేవలో నిమగ్నమవుతానని చెప్పి రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిని రేపిన ఆయన.. ఏ పార్టీలో చేరుతారోనన్న ప్రశ్నలు ఇన్నాళ్లు వినిపించాయి. అయితే ఉద్యోగానికి విరమణ పలికిన నేపథ్యంలో ఆయన గ్రామీణ సమస్యలపై, ప్రత్యేకించి రైతుల కష్టాలపై ఆయన అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించారు. గ్రామాలను సందర్శించి నేరుగా రైతులను కలుసుకుని, వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. అలాగే, కాలేజీలకు కూడా వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారిని చైతన్యపరిచారు.

ఆ క్రమంలో ఆయనను రాజకీయాల్లోకి అహ్వానించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. ఇటీవల సంభవించిన తిత్లీ తుఫాను నేపథ్యంలో శ్రీకాకుళంలో పర్యటించిన ఆయన ఏపీ ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు బాగున్నాయని ప్రశంసిస్తూనే, బాధితుల సమస్యల పరిష్కారానికి స్వల్ప, దీర్ఘకాలిగా చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు. దీంతో ఆయన జనసేనలో చేరడం లేదని టీడీపీలో చేరుతున్నారని కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం తాను ఎవరితో కలవబోనని, తానే స్వయంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నానని తాజాగా సంకేతాలు ఇచ్చారు.

అయితే తాను స్థాపించబోయే పార్టీ ప్రస్తుత పార్టీలన్నింటికీ విభిన్నంగా వుంటుందని చెప్పుకోచ్చిన లక్ష్మీనారాయణ.. తన పార్టీలో వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే ప్రధాన అజెండాగా వుంటాయని వెల్లడించారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఎతో పేరు కలిగి, ప్రజాదరణ కలిగిన మాజీ ఐపీఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కూడా పార్టీని స్థాపించి.. తన ప్రభావం చాటినా.. రాష్ట్రంలో అప్పట్లో నెలకోన్న పరిస్థితుల్లో తాను రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మరీ తాజాగా లక్ష్మీనారాయణ పార్టీని స్థాపించి విజయాన్ని అందుకోగలరా.? అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Political Party  JD Lakshminaryana  political entry  cbi ex jd  YS Jagan  Andhra Pradesh  

Other Articles