3-day bank holiday this week బ్యాంకులకు నాలుగు రోజుల సెలవులు..

Banks to re open on monday excluding thursday this week

bank holidays 2018, bank holidays november 2018, bank holidays delhi, bank holidays mumbai, bank holidays in india, sbi bank holidays, icici bank holidays, hdfc bank holidays bengaluru, bank holidays maharashtra, bank holidays karnataka, bank holidays up, bank holidays rajasthan

Banks in Mumbai, rest of Maharashtra, New Delhi, Hyderabad, Raipur, Ranchi, Srinagar, Dehradun, Jammu, Srinagar, Kanpur and Lucknow (Uttar Pradesh) will be closed for three days — Wednesday, Friday and Saturday.

గురువారం మినహాయిస్తే మళ్లీ సోమవారం కలుద్దాం: బ్యాంకులు

Posted: 11/20/2018 12:19 PM IST
Banks to re open on monday excluding thursday this week

బ్యాంకులకు వరుస సెలవులు లభించాయి. ఇక ఈ వారంలో రెండు రోజులు మినహాయిస్తే మిగతా రోజులన్నీ బ్యాంకులకు సెలవులే. గురువారం ఒక్క రోజున బ్యాంకులు తెరచి వుంటాయి. ఆ రోజున మినహాయిస్తే ఇక బ్యాంకుల్లో ఎలాంటి పునులున్నా వాటిని సోమవారమే పూర్తి చేసుకోవాల్సా వుంటుంది. బ్యాంకుల్లో అత్యవసర పనులేమైనా వుంటే తక్షణమే పూర్తి చేసుకోవాల్సిందే సుమా. ఈ వారంలో మిగిలిన ఆరు రోజుల్లో 4 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించాయి.

ఇక బ్యాంకు సిబ్బందికి సెలవులు లభించిన నేపథ్యంలో ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. బ్యాంకులకు అనుకుని వుండే దాదాపు అన్ని ఏటీయం కేంద్రాలు సెలవు రోజుల్లో మూసివేయబడే వుంటాయి. ఇక మిగిలిన ఏటీయం కేంద్రాలలో సెలవు రోజుల్లో అధికంగా వుండే ఖర్చుల నిమిత్తం డబ్బు వుండకపోవచ్చు. దీంతో సరిపడేంత నగదు విత్ డ్రా చేసుకొని పెట్టుకోవడం ఉత్తమం. లేదంటే ఏ అవసరం వచ్చినా.. ఏటీయం కేంద్రాల చుట్టూ తిరిగి అలసిపోవడయం.. చెప్పులు అరగడం తప్ప ప్రయోజనం శూన్యం.

ఇక వరసగా మూడు రోజుల పాటు సెలవులు, వారంలో నాలుగు రోజుల మూసివేత ఎందుకన్న వివరాల్లోకి వెళ్తే.. బుధ, శుక్ర, శనివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. బుధవారం (నవంబరు 21) ఈద్‌-ఇ-మిలాద్‌-ఉల్‌-నబీ కాగా, శుక్రవారం (నవంబరు 23) గురునానక్‌ జయంతితో పాటు కార్తీక పౌర్ణమి కూడా ఉంది. ఇక వారాంతమైన 24, 25 తేదీలు ఎలాగూ నాలుగో శనివారం, ఆదివారం సెలవు దినాలనే విషయం తెలిసిందే. దీంతో జనం ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

అయితే.. శుక్రవారం మాత్రం కొన్ని ప్రైవేట్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, రాంచీ, రాయ్‌పూర్‌, శ్రీనగర్‌, డెహ్రాడూన్‌, జమ్మూల్లో బుధ, శుక్ర, శనివారాలు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక భోపాల్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై నగరాల్లోని బ్యాంకులకు కేవలం బుధ, శనివారాల్లో మాత్రమే సెలవులు ఇచ్చారు. ఏదేమైనా.. నేరుగా బ్యాంకుల్లో ఏదైనా పని ఉన్నవారు మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే 26వ తేదీ వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles