Nadendla Manohar narrow escapes in road mishap కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న నాదేండ్ల

Nadendla manohar escapes unhurt in road mishap near jubilee hills

pawan kalyan, janasena, nadendla manohar, car accident, lorry, jubilee hills, hyderabad police, andhra pradesh, politics, Crime

Jana Sena Party leader Nadendla Manohar’s car met with a minor accident at Jubilee Hills here three days ago and the former Assembly speaker escaped unhurt in the mishap.

కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న నాదేండ్ల మనోహర్

Posted: 11/20/2018 11:25 AM IST
Nadendla manohar escapes unhurt in road mishap near jubilee hills

ఉమ్మడి రాష్ట్ర ఆఖరు స్పీకర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గత గురువారం నాడు జరిగిన ఈ ఘటన.. పోలీసులు లారీ డ్రైవర్ కోసం అన్వేషిస్తున్న సమయంలో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. అయితే, మనోహర్‌కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 15న మనోహర్ మాదాపూర్ నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో హెరిటేజ్ వద్ద కారు టర్న్ తీసుకుంటుండగా, వెనక నుంచి వచ్చిన లారీ మనోహర్ కారును ఢీకొట్టింది. కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే, కారులో ఉన్న నాదేండ్ల మనోహర్ కు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో మనోహర్ ను కారు నుంచి దిగి.. వెంటనే మరో కారును తెప్పించుకుని అందులో వెళ్లిపోయారు.

నాదేండ్ల కారు డ్రైవర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ నాగరాజుపై ఐపీసీ 336, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో ఈ విషయం మీడియాకు తెలిసింది. దీంతో నాదేండ్ల మనోహర్ కు జరిగిన కారు ప్రమాదం ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles