New Rs 100 note features కొత్త అసులు రూ.100 నోటును గుర్తించడం తేలిక..

New rs 100 note features will reveal if it is fake or not

new Rs 100 note, new Rs 100 note image, New Rs !00 fake note, new Rs 100 note features, new Rs 100 original note

Banks have started giving new Rs 100 currency notes to customers. The new notes are also being dispensed from several ATMs.

చిరగని కొత్త రూ. 100 నోటు.. విశేషాలు అనేకం..

Posted: 11/19/2018 08:30 PM IST
New rs 100 note features will reveal if it is fake or not

నోట్ల రద్దు తర్వాత, 2000, 500, 100 వంటి పెద్ద నోట్లు కొత్తవి వచ్చాయి. వీటిలో రూ.100 నోటును కొత్తగా వార్నిష్ పెయింట్‌తో తీసుకొస్తున్నారు. బ్యాంకులకు చేరిన ఈ నోట్లు సోమవారం నుంచీ చెలామణీలోకి వస్తున్నాయి. ఇప్పటికే వీటిని ఏటీఎంలలో సెట్ చేశాయి బ్యాంకులు. చూడటానికి చాలా అందంగా ఉన్న వంద నోటు, నకిలీదో, నిజమైనదో గుర్తించలేకపోతే ప్రమాదమే. ఎందుకంటే ఏడాది కాలంగా ఎక్కువ నకిలీ నోట్లు వంద రూపాయలవే ఉంటున్నాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

మహాత్మాగాంధీ న్యూ సిరీస్‌తో కొత్త వంద రూపాయల నోట్లు తెస్తామని రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించింది. వీటిపై రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. లావెండర్ కలర్‌లో ఉన్న ఈ నోట్లకు వెనకవైపున దేశపు సంస్కృతి, వారసత్వ సంపదను ముద్రించారు. నోటుకు రెండువైపులా రకరకాల డిజైన్లు, జామెట్రిక్ లైన్స్ ఉంటాయి. దీని పరిమాణం 66 మిల్లీమీటర్లు x 142 మిల్లీమీటర్లు ఉంటుందని రిజర్వ్‌బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఉన్న పాత వంద రూపాయల నోట్ సైజులోనే కొత్త నోటు కూడా దాదాపు ఉంటుంది.

నకిలీదని గుర్తించడం కూడా తేలికే.. ఇలా:

ముందుబాగం

1. డినామినేషన్ సంఖ్య 100 ఉంటుంది.
2. డినామినేషన్ 100 సంక్య లాటెంట్ ఇమేజ్ తో కనిపిస్తుంది.
3. డినామినేషన్ నంబర్ 100 దేవనాగరి లిపిలో ఉంటుంది.
4. మధ్యలో మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది.
5. ఆర్బీఐ, భారత్, ఇండియా, 100 వంటివి చిన్న అక్షరాలలో వున్నాయి.
6. సెక్యూరిటీ త్రెడ్‌లో భారత్, ఆర్బీఐ అని ఉంటుంది. నోటును వంచినప్పుడు ఈ దారం గ్రీన్ కలర్ నుంచీ బ్లూ కలర్‌లోకి మారుతుంది.
7. మహాత్మాగాంధీ చిత్రానికి కుడివైపున గ్యారెంటీ క్లాజ్ గా గవర్నర్ సంతకం, ప్రామిస్ క్లాజ్ గా ఆర్బీఐ ముద్ర ఉంటాయి.
8. కుడివైపున అశోక స్థూపం ఉంటుంది.
9. ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్స్ ఉంటాయి.
10. ఎడమవైపు, పైభాగం, కుడివైపు కింది భాగంలో చిన్నవి నుంచీ పెద్దవి అవుతూ నంబర్ ప్యానెల్ ఉంటుంది.

11. దివ్యాంగుల కోసం
మహాత్మాగాంధీ చిత్రం, అశోక స్థూపం పైకి ఉబ్బినట్లుగా ఉంటుంది.
ట్రయాంగ్యులర్ గుర్తింపు మార్కులు,
మైక్రో టెక్ట్స్ 100,
ఫోర్ యాంగ్యులర్ బ్లీడ్ లైన్స్ కుడి, ఎడమవైపు ఉన్నాయి.

వెనుక భాగం:

1. నోటుకు ఎడమవైపు ముద్రించిన ఏడాది ఉంటుంది.
2. స్వచ్ఛభారత్ లోగో స్లోగన్ తో పాటుగా కనిపిస్తుంది.
3. లాంగ్వేజ్ ప్యానెల్
4. గుజరాత్‌లోని పటాన్‌ పట్టణంలోని చారిత్రక కట్టడం రాణీ కీ వావ్ మెట్ల బావి చిత్రం వుంది.
5. డినామినేషన్ 100 సంఖ్య దేవనాగరి లిపిలో ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles