Digvijay Singh dares PM Modi for his arrest దమ్ముంటే అరెస్టు చేయండీ: ప్రధానికి దిగ్విజయ్ సవాల్

Bhima koregaon case digvijay singh dares pm modi for his arrest

PM Modi,Minister Rajnath Singh,Maharashtra CM Devendra Fadnavis,Digvijay Singh,bhima koregaon case

Congress Leader Digvijay Singh dares PM Modi, Home Minister Rajnath Singh and Maharashtra CM Devendra Fadnavis for his arrest in the Bhima Koregaon case.

దమ్ముంటే అరెస్టు చేయండీ: ప్రధానికి దిగ్విజయ్ సవాల్

Posted: 11/19/2018 08:26 PM IST
Bhima koregaon case digvijay singh dares pm modi for his arrest

నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయంటూ తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోమవారంనాడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. మావోయిస్టు మద్దతుదారులకు దిగ్విజయ్ సింగ్ ఫోను నెంబర్ నుంచి కాల్ వెళ్లినట్టు భీమా-కొరెగావ్ కేసులో పుణె పోలీసులు విచారణలో బయటపడినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ స్పందించారు.

'నాపై ఆధారాలు నిరూపించాల్సిందిగా ప్రధాని మోదీ, హోం మత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, మహారాష్ట్ర పోలీసులను నేను సవాలు చేస్తున్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు వాళ్లు నిరూపించ గలిగితే ఎలాంటి లీగల్ చర్యలకైనా నేను సిద్ధం' అని దిగ్విజయ్ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నన్ను చూసి భయపడుతున్నాయి, అందుకే నామీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దిగ్విజయ్ ఆరోపించారు.

మావోయిస్టులతో తనకు సంబంధాలున్నాయంటూ బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడటం ఓ 'జోక్‌'గా ఆయన అభివర్ణించారు. తన ఫోన్ ‌నెంబర్ గా చెబుతున్న నెంబర్ ను తాను ఉపయోగించి నాలుగేళ్లయిందని ఆయన చెప్పారు. 'రాజ్యసభ వెబ్‌సైట్ లో ఆ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంది. ఎవరైనా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే....గత నాలుగేళ్లుగా ఆ ఫోన్ నెంబర్ నేను వాడిందే లేదు' అని చెప్పారు. తనను నక్సలైట్ గా ఆరోపిస్తున్న బీజేపీ ఎందుకు అరెస్టు చేయడం లేదని దిగ్విజయ్ నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles