HC issues notices to Chandrababu and 8 others చంద్రబాబు సహా 8 మందికి హైకోర్టు నోటీసులు

High court issues notices to ap cm chandrababu in jagan attack case

YS Jagan, YS Jagan attacked, Srinivas Rao, YV Subba Reddy, High court, Chandha Babu, SIT, Vizag Airport, airport cctv footage, ys jagan vizag airport attack, YS Jagan srinivas rao, YS Jagan vishakapatnam airport attack, YSRCP, Vishakapatnam airport, andhra pradesh, politics

Hyderabad High court issues notices to Andhra Pradesh Chief Minister Chandrababu and 8 others including DGP and SIT in opposition leader YS jagan attack case.

జగన్ పై దాడి కేసు: చంద్రబాబు సహా 8 మందికి హైకోర్టు నోటీసులు

Posted: 11/13/2018 02:21 PM IST
High court issues notices to ap cm chandrababu in jagan attack case

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు షాకిచ్చింది. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసును.. ప్రభుత్వ కుట్రగా పేర్కోంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబుతో సహా 8మందికి నోటీసులు జారీ చేసింది. తమ నోటీసులపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని న్యాయస్థాన ధర్మాసనం ఆదేశించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ, తెలంగాణ డీజీపీలకు కూడా హై్కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే విశాఖ విమానాశ్రయంలో భద్రతా లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. కేసుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్ లో అందించాలని సిట్ ను ఆదేశించింది. ఈ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రతిపక్ష నేత జగన్ పై అంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కుట్రపూరితంగా వ్యవహరించి.. దర్యాప్తును కూడా తమ ఇష్టానుసారంగా చేయిస్తుందని పిటీషన్ లో వైవీ సుబ్బారెడ్డి పెర్కోన్నారని సమాచారం.

మరోవైపు దాడి కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా మంగళవారం విచారణ జరిగింది. సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ బీవీఎస్‌ నాగేశ్వరరావు కేసు వివరాలను సీల్డ్‌కవర్‌లో కోర్టుకు అందజేశారు. అనంతరం ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ సందర్భంలో సీసీ టీవీ ఫుటేజ్‌ వివరాలను ఏమయ్యాయని ధర్మాసనం అధికారులను ప్రశ్నించింది. గత మూడు నెలలుగా సీసీ టీవీ ఫుటేజ్‌ లేదని అధికారులు తెలపడంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీసీటీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందనే విషయంపై సిట్‌ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ భద్రతా లోపాలు క్షమించారానివని ధర్మాసనం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  YS Jagan  Srinivas Rao  YV Subba Reddy  High court  Chandha Babu  SIT  Vizag Airport  crime  

Other Articles