CBI may re-investigate Ayesha murder case అయేషామీరా హత్యకేసు పునర్విచారణ.?

Hc receives report on disappearance of material objects in ayesha murder case

Ayesha murder case, High Court, CBI Re-investigation, Satyam Babu, evidences, Vijayawada, Ibrahimpatnam, Hyderabad High Court, Chief Justice, Thottathil B. Radhakrishnan, Justice S.V. Bhatt, Krishna Prakash, crime

The Hyderabad High Court is contemplating handing over the re-investigation of Ayesha Meera murder case to the Central Bureau of Investigation (CBI).

అయేషామీరా హత్యకేసు పునర్విచారణ యోచనలో హైకోర్టు?

Posted: 11/13/2018 01:35 PM IST
Hc receives report on disappearance of material objects in ayesha murder case

2007 లో సంచలనం సృష్టించిన ఫార్మసి విద్యార్థి ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో 2007 డిసెంబరులో ఆయేషామీరా హత్యాచారం చేయబడింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సత్యంబాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కాగా, ఈ కేసులో అసలు దోషులు ఎవరు అన్న ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే వుంది. ఇక ఈ కేసులో కీలకమైన అధారాలన్నీ ఇప్పటికే మాయమయ్యాయి.

ఈ కేసులో అసలు దోషులు ఓ మాజీ మంత్రి కొడుకేనని అప్పట్లో వార్తలు వచ్చినా.. సత్యం బాబును అరెస్టు చేసి పదేళ్ల శిక్ష తరువాత ఆయనను నిర్దోషిగా రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ప్రకటించడంతో విడుదలయ్యాడు. దీంతో ఈ కేసులో అసలైన దోషులను శిక్షించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. కాగా ఈ హత్యకేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేశారని హైకోర్టు రిజిస్టర్ జనరల్ న్యాయస్థానానికి నివేదికలు అందజేశారు.

దీనిపై అగ్రహాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేయడం వెనుక కింది కోర్టులోని న్యాయాధికారులతో సహా మరే ఇతర అధికారుల హస్తం ఉన్నా ఎవర్నీ వదలిపెట్టబోమని హైకోర్టు స్పష్టం చేసింది. హత్య కేసు ‘అప్పీల్‌’ పైకోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు నాశనం చేయడం ఏంటని మండిపడింది. అయితే రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన సీల్డు కవర్ లో సమర్పించిన నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత ఈ కేసును సిబిఐ చేత పునర్విచారణకు అదేశిస్తామని హైకోర్టు తెలిపింది.

ఈ ప్రజాప్రయోజన వాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసి వాయిదా వేసింది. కాగా, సిట్‌ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణ ప్రకాశ్ వాదనలు వినిపించారు. వస్తు సంబంధ సాక్ష్యాలు అందుబాటులోలేని కారణంగా ఈ కేసును సీబీఐ సైతం దర్యాప్తు ప్రారంభించడం కష్టంగా ఉంటుందని ఆయన తెలిపారు. అయితే, ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఇలాంటి సందర్భాల్లోనూ దర్యాప్తు ఎలా చేపట్టాలో సీబీఐకి తెలుసునని వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayesha murder case  High Court  CBI Re-investigation  Satyam Babu  evidences  crime  

Other Articles