former minister p.balaraju joins janasena జనసేనలో చేరిన మాజీ మంత్రి పి.బాలరాజు

Former minister p balaraju joins janasena

pawan kalyan, janasena, Vijayawada, pasupuleti balaraju, congress, pawan kalyan press meet, Pawan Kalyan uttatandhra, Pawan Kalyan vijayawada, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan says janasena will become very strong with the joining of former minister pasupuleti balaraju

జనసేనలో చేరిన మాజీ మంత్రి పి.బాలరాజు

Posted: 11/10/2018 05:00 PM IST
Former minister p balaraju joins janasena

భావితరాలకు, బడుగు బలహీనవర్గాలకు అండగా ఉండాలన్న ఆశయంతోనే జనసేన పార్టీని స్థాపించానని పవన్ కల్యాణ్ తెలిపారు. తాము రాజకీయ పార్టీని పెట్టినప్పుడు ఎలాంటి అనుభవం లేని సామాన్యులే పార్టీలో ఉన్నారని వెల్లడించారు. 2014లో ఏపీ విభజన తర్వాత పోటీ చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీకి మద్దతు ఇచ్చామని వ్యాఖ్యానించారు. మన ఆశయాలు, పార్టీ సిద్దాంతాలు మంచిగా ఉంటే నాయకులు తమంతటా తామే వస్తారని తాను విశ్వసిస్తానని పవన్ తెలిపారు.

మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. జనసేన పార్టీలో చేరారు. బాలరాజుకు జనసేన కండువా కప్పి.. పార్టీలోకి సాదరంగా అహ్వానించారు పవన్ కల్యాన్, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన పార్టీ సిద్దాంతాలు, ఆశయాలు నచ్చి.. భావసారూప్యత ఉన్న నాదెండ్ల మనోహర్, బాలరాజు జనసేనలో చేరారని వెల్లడించారు. ఓ ఆర్టీసీ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన బాలరాజు మూడు సార్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు.

వైఎస్ హయాంలో మైనింగ్ ఉద్ధృతంగా సాగుతున్న వేళ.. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను బాలరాజు గట్టిగా వ్యతిరేకించి అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో బాలరాజు చాలా గట్టిగా నిలబడ్డారని వ్యాఖ్యానించారు. ఇక నాదెండ్ల మనోహర్ అయితే ఓ స్పీకర్ గా చాలామంది ప్రజాప్రతినిధులు అరకు ప్రాంతానికి తీసుకెళ్లి వాస్తవ పరిస్థితులను చూపారన్నారు. టీడీపీ ఎంత ఒత్తిడి చేసినా లొంగకుండా గిరిజన ప్రజలకు అండగా బాలరాజు నిలబడ్డారని కితాబిచ్చారు.

క్షేతస్థాయిలో వాస్తవాలు తెలియకుండా ప్రజా సమస్యలపై పోరాడలేమని పవన్ కల్యాణ్ నమ్ముతారని తెలిపారు. బాలరాజు నిన్న డీసీసీ పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. అరకు లాంటి మారుమూల ప్రాంతంలో 150 మంది ప్రతినిధులకు పవన్ ప్రత్యేక శిక్షణ ఇప్పించారని బాలరాజు వెల్లడించారు. అధికారం కోసం కాకుండా సమాజంలో మార్పు కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఈ ఉద్యమంలో భాగస్వామి అయ్యేందుకు జనసేనలో చేరినట్లు తెలిపారు. జనసేనలో చేరడానికి తాను షరతులేమీ పెట్టలేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Vijayawada  pasupuleti balaraju  congress  andhra pradesh  politics  

Other Articles