sonia gandhi to campaign for elections in telangana తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ

Dates fixed for sonia gandhi election campaign in telangana

Elections, telangana elections 2018, vote bank politics, congess elections campaign, sonia gandhi election campaign, rahul gandhi election campaign, sonia gandhi, rahul gandhi, trs vs congress, political strategy, political stategy in telangana, grand alliance, telangana, Politics

UPA chair person Sonia Gandhi gives a good news to Congress activists, she fixed her day to campaign in telangana.

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ.. డెట్స్ ఫిక్స్..

Posted: 11/10/2018 05:00 PM IST
Dates fixed for sonia gandhi election campaign in telangana

తెలంగాణలో గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ... అదే ఊపును ఎన్నికల ప్రచారంలోనూ కొనసాగించి విజయం సాధించాలని భావిస్తోంది. ఇప్పటికే పలు పార్టీలతో కలిసి కూటమిగా జట్టు కట్టిన కాంగ్రెస్... ఇక ప్రచారంపై దృష్టి పెట్టింది. కేసీఆర్ లాంటి ధీటైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు అధినేత రాహుల్ గాంధీని బరిలోకి దింపిన కాంగ్రెస్.. సోనియాను కూడా రంగంలోకి తీసుకొస్తోంది.

రాహుల్ వరుస పర్యటనలతో తెలంగాణలో యాక్టివ్ మోడ్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అదే వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభల్లో రాహుల్ పాల్గొనేలా కార్యాచరణ రూపొందించింది. అయితే సోనియాను కూడా ప్రచారానికి తీసుకువస్తే .. మరింత ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే రెండు మూడు భారీ మీటింగుల్లో సోనియా గాంధీ పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

ఈనెలలోనే సోనియా గాంధీ తెలంగాణకు రానున్నట్టు తెలుస్తోంది. 19వ తేదీ తర్వాత ఆమె పర్యటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 22, 23 తేదీల్లో రెండ్రోజుల పాటు ఆమె రాష్ట్రంలో ఉండి రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లో సోనియాగాంధీ పాల్గొనే సభలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తిగా సోనియా పట్ల తెలంగాణ ప్రజలకు అభిమానం ఉందని.. ఆమె పర్యటన ద్వారా పార్టీ విజయం సులువవుతుందని నేతలు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : #Mahakutami  Sonia Gandhi  #Congress  #TDP  #TJS  #CPI  #telangana politics  

Other Articles