gali janardhan reddy surrenders to police బెంగుళూరులో పోలీసులకు లొంగిపయిన గాలి జనార్థన్ రెడ్డి

Mining baron gali janardhan reddy surrenders to bengaluru police

Janardhan Reddy, Mining Baron, surenders to police, bengaluru police, bribery case, Karnataka High court, Bengaluru sessions court, Central Crime Branch, Ambidant Marketing Pvt Ltd, Ballerys mining baron, Karnataka Police, BJP former minister, crime

Mining Baron Gali Janardhana Reddy, who has been accused of bribing an Enforcement Directorate official, had been surendered to bengaluru police today

బెంగుళూరు పోలీసులకు లొంగిపోయిన గాలి జనార్థన్ రెడ్డి

Posted: 11/10/2018 04:00 PM IST
Mining baron gali janardhan reddy surrenders to bengaluru police

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి ఓ అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో తప్పించుకుని తిరుగుతున్న క్రమంలో అతన్ని అన్వేషించేందుకు నాలుగు బృందాల కర్నాటక పోలీసులు గాలిస్తున్న తరుణంలో ఆయన పోలీసులకు షాక్ ఇచ్చారు. ఏకంగా ఆయన బెంగళూరు పోలీసులకు లొంగిపోయారు. ఓ వైపు తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో అన్ని సత్యదూరమని చెప్పుకోచ్చిన ఆయన.. తనపై కేసును కొట్టివేయాల్సిందిగా కర్ణాటక హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

అదే సమయంలో తనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేయాలని కూడా బెంగళూరు అడిషనల్ సెషన్స్ కోర్టులో మరో పిటీషన్ ను దాఖలు చేశారు. కాగా దీనిపై విచారణను న్యాయస్థానం ఈ నెల 12కు వాయిదా వేసింది. అయితే ఈలొగా ఆయన బెంగళూరు పోలీసులకు షాక్ ఇస్తూ.. ఇవాళ మధ్యహ్నం ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇవాళ మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరు పోలీసు పెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో పోలీసులకు లోంగిపోయారు. లొంగిపోయే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన తనపై నిరాధారమైన అభియోగాలు నమోదు చేశారని, తాను పరారీలో కూడా లేనని తెలిపారు.

అంబిడెంట్ అనే కంపెనీని కాపాడటానికి గాలి 57 కేజీల బంగారం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మరో ఈడీ అధికారికి రూ.కోటి లంచం ముట్టజెప్పినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డిని విచారించేందుకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో రహస్య లాకర్లు వున్న విషయాన్ని కూడా కనుగొన్నారు. అయితే గాలి జనార్థన్ రెడ్డి లొంగిపోయిన నేపథ్యంలో ఈ లాకర్లలో ఏముందీ అన్నది కూడా తేలిపోనుంది. కాగా, ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి గాలి జనార్థన్ రెడ్డి దేశం దాటిపోకుండా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janardhan Reddy  Mining Baron  surenders to police  bengaluru police  Karnataka  crime  

Other Articles