Kevin case an honour killing: Court puts on fast track వీళ్లు కేరళ అమృత- ప్రణయ్ లు.. అదే కథ రిపీట్..

Kevin murder case an honour killing kerala court says trial to finish in six months

Kevin murder case, Dalit Christian, honour killing, Kevin P Joseph, Kevin murder case, kevin honour killing, Kerala Honour killing, Neenu Chacko Kevin, Kevin case, amrutha, pranay, miryalaguda, Telangana, Kottayam honour killing, kottayam court, Kerala crime

Kevin’s murder is a case of honour killing, the Kottayam Additional Sessions Court said. The ruling came during the hearing of special prosecutor C S Ajayan’s petition seeking to consider Kevin’s murder as an honour killing.

ప్రణయ్-అమృతలు ఇక్కడ.. నీనూ-జోసెఫ్ లు అక్కడ.. సేమ్ స్టోరీ..

Posted: 11/08/2018 12:28 PM IST
Kevin murder case an honour killing kerala court says trial to finish in six months

మిర్యాలగూడలో జరిగిన కులాంతర వివాహం చేసుకున్న అమృత-ప్రణయ్ జంటపై కత్తిగట్టిన అమృత తండ్రి మారుతీరావు తన అల్లుడిని కిరాయి హంతకులతో అత్యంత దారుణంగా అసుపత్రి ఆవరణలో హత్య చేయించిన ఘటన ఇప్పటికీ తెలంగాణలో చర్చనీయాంశంగా మారుతుంది. ఈ ఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నా.. ఇంకా అమృతకు ప్రణయ్ ఆత్మను చూపిస్తామని, మాట్లాడిస్తామని, వచ్చిన ఆగంతకలు అరెస్టు కావడం.. ఇటీవలే అమె నివాసంలో ఆజ్ఞాతవ్యక్తి సంచరించడం లాంటి వార్తలతో ఈ ఘటన ఇప్పటికీ వార్తలో వుంది.

అయితే ఇదే తరహాలో ఆరు నెలల క్రితం కేరళలో కూడా ఓ ఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో తాజాగా జరిగిన విచారణలో ఇది కూడా పూర్తిగా పరువు హత్యేనని కోర్టు నిర్ధారించింది. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీచేసింది. ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే... కూతురుని తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడనే కారణంగా ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని చంపి కెనాల్‌లో పడేశారు. యువతిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న రెండు రోజులకే ఘటన జరిగింది. ఆ యువతీయువకులు కేరళలోని కొట్టాయంకు చెందిన నీనూ(21), జోసెఫ్(23). జోసెఫ్ బైక్ మెకానిక్‌గా పనిచేసేవాడు. వీరిద్దరి రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు.
 
పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో జోసెఫ్ నీనూను తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన యువతి కుటుంబం జోసెఫ్‌ను కిడ్నాప్ చేయించింది. కిడ్నాప్ అయిన మరుసటి రోజు అతని శవం చాలియెక్కర కెనాల్‌లో తేలియాడుతూ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి కొట్టాయం అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు ఈ కేసును పరువు హత్య‌గా తేల్చింది. ఈ కేసు విచారణ ఆరు నెలల్లో పూర్తి చేయాలని పోలీసులను ఆదేశిస్తూ ఫాస్ట్ ట్రాక్ కు కేసును బదిలీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kevin murder case  Dalit Christian  honour killing  Kevin P Joseph  Neenu  kottayam court  

Other Articles