Woman arrested for extortion, blackmail ‘‘పరువుగా వుండాలంటే.. పది ఇవ్వాల్సిందే’’: మహిళ బెదిరింపులు..

Woman accused for blackmailing man with false rape charge arrested

Greater Noida, Lakhnawali village, blackmailing, threatening, false rape case, friends, Surajpur Police station, Muneesh Chauhan, crime news, Noida crime news, Cyber Crime News, Rape News, Crime case, Latest crime news

A woman has been arrested in Greater Noida for allegedly trying to extort Rs 10 lakh from a man threatening to implicate him in a false rape case should he refuse to pay her the said amount

‘‘పరువుగా వుండాలంటే.. పది ఇవ్వాల్సిందే’’: మహిళ బెదిరింపులు..

Posted: 11/06/2018 12:44 PM IST
Woman accused for blackmailing man with false rape charge arrested

పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా దగా, అంటూ మహాకమి శ్రీరంగం శ్రీనివాసరావు చెప్పిన కవితలు వాస్తవాలని ఇప్పటికే అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇక తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో కూడా శ్రీశ్రీ వాఖ్యలను నిజమని నిరూపించింది ఓ మహిళ. తనతో ఎంతో స్నేహపూర్వకంగా వుండే వ్యక్తిని.. పరువుగా వుండాలంటే పది ఇవ్వాల్సిందేనని హెచ్చరించింది. అదేంటి అర్థం కాలేదా.? తన స్నేహితుడైన వ్యక్తిని మహిళ బెదిరించి డబ్బు లాగే ప్రయత్నం చేసింది.

రూపాయలు పది లక్షలు ఇస్తే.. పరువుగా వుంటావు.. లేకపోతే పరువు పోగొట్టుకుని అత్యాచారం కేసులో ఇరుక్కుంటావు.. 10 లక్షలు ఇవ్వకపోతే నీపై నకిలీ రేప్ కేసు పెట్టేస్తా అంటూ బెదిరించి అప్పన్నంగా డబ్బు లాగే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోన్ సంబాషణలు, ఛాటింగ్ సమాచారాన్ని అధారంగా చేసుకున్న పోలీసులు అమెను కటకటలా వెనక్కి పంపారు. ఉత్తరప్రదేశ్‌లోని సూరజ్‌పూర్ పరిధిలోని లఖ్నావాలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బాధితుడు, నిందితురాలు కొంత కాలం క్రితం వరకూ స్నేహితులుగా ఉండేవారు. ఆమె తరచుగా ఏవో ఒక కారణాలు చెప్పి అతని నుంచి కొంత డబ్బును వసూలు చేసింది. అయితే కొంతకాలం క్రితం ఆయన తానిచ్చిన డబ్బును అవసరం వుండటంతో అడిగాడు. అప్పటి నుంచి అమె అతడ్ని కలవడం మానేసింది. అక్కడితో వారిద్దరి మధ్య స్నేహం కూడా మసకబారింది. ఈ క్రమంలో ఒక రోజు అనుకోకుండా అమె నుంచి బాధితుడికి ఫోన్ కాల్ వచ్చింది.

దీంతో అమె కాల్ లిప్ట్ చేసిన బాధితుడు అమె చెప్పిన మాటలు విని షాకయ్యాడు. స్నేహం రూపంలో వున్న శత్రువు అన్న వ్యాఖ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. అమె కాల్ చేసి.. తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తాను అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే తప్పుడు రేప్ కేసు బనాయించి.. నీ పరువుపై దెబ్బకొడతానంటూ బెదిరించింది.. ఈ నేపథ్యంలో బాధితుడు తన సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువురి సంభాషణలూ పరిశీలించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Greater Noida  Lakhnawali village  blackmailing  threatening  false rape case  Uttar Pradesh  crime  

Other Articles