LPG Cylinder Gets More Expensive సామాన్యులపై గుదిబండ.. పెరిగిన సబ్బీడీ సిలిండర్ ధర

Subsidised lpg price hiked by rs 2 94 per cylinder

LPG price hike, LPG price rise, LPG cylinder, gas cylinder, subsidised LPG gas cylinder, non-subsidised gas cylinder

In the sixth straight monthly increase in rates since June, the price of subsidised LPG gas cylinders was hiked, by Rs 2.94 per cylinder and Rs 60 per cylinder for the non-subsidised category.

సామాన్యులపై గుదిబండ.. పెరిగిన సబ్బీడీ సిలిండర్ ధర

Posted: 11/01/2018 10:05 AM IST
Subsidised lpg price hiked by rs 2 94 per cylinder

యూపీఏ ప్రభుత్వంలో ఎప్పుడో కానీ పెరగని సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో మాత్రం నెలకొ పర్యాయం పెరుగుతూనే వున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలతో పాటు దీని ధరలు కూడా పెరుగుతూ వుంది. గత జూన్ మాసం నుంచి నెలకు మూడు రూపాయల మేర పెరుగుతూ వచ్చిన సిలిండర్ ధర తాజా పెంపుతో ఏకంగా ఆరు మాసాల్లో రూ.14.13 పైసల మేర పెరిగింది. దీంతో సబ్సీడీ సిలిండర్ వాడుతున్న సామాన్యులపై అదనపు భారం పడింది.

తాజాగా అమల్లోకి వచ్చిన ధరల పెంపు అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఫలితంగా గ్యాస్ సిలిండర్ ధర రూ. 505.34కు చేరుకుంది. అలాగే, సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ. 60 పెంచింది. ఈ సిలిండర్ ధర రూ. 939కి చేరుకుంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, విదేశీ మారక ద్రవ్యంలో ఒడిదొడుకులు కారణంగానే ధరలు పెంచినట్టు ఐవోసీఎల్ తెలిపింది. కాగా, ఇప్పటి వరకు గ్యాస్ వినియోగదారుల ఖాతాలో ఒక్కో సిలిండర్‌కు రూ.376.60 జమకాగా, ఈ నెల నుంచి రూ.433.66 జమ కానున్నాయి.

అయితే ఇప్పటికే అటు ఇంధన ధరల పెరుగుదలతో సతమతం అవుతున్న దేశప్రజలు.. వాటి ప్రభావం నిత్యావసర సరుకులపై కూడా పడి అన్ని వస్తువులు, సరుకుల ధరలు పెరిగి పేద,బడుగు వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇంధన ధరల పెంపుతో రవాణా సహా అన్ని రంగాలు కూడా ప్రభావితం అవుతూ సామాన్య మధ్య తరగతి ప్రజలను జీవన స్థితిగతులను ప్రభావితం చేస్తుంది. ఇదే క్రమంలో అటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగడం వారిపై మరింత ప్రభావం పడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles