Jet Airways Diwali offer on flight tickets జెట్ ఎయిర్ వేస్ దీవాళీ సేల్ ఆఫర్

Jet airways diwali sale up to 30 discount on offer on flight tickets

Jet Airways, Jet Airways Diwali Offer, Jet airways 30% Discount offer, discount on Flight Tickets, airlines Diwali Sale offer, discount rate

Jet Airways has announced a 7-day global sale for air passengers. Under Jet Airways Happy Diwali festive season offer, passengers can avail up to 30% discount on its domestic and international routes

ప్రయాణికులకు జెట్ ఎయిర్ వేస్ దీపావాళీ సేల్ ఆఫర్..

Posted: 11/01/2018 10:57 AM IST
Jet airways diwali sale up to 30 discount on offer on flight tickets

దేశంలోనే రెండో అతి పెద్ద ఎయిర్ లైన్స్ సంస్థ అయిన జెట్ ఎయిర్ వేస్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుందా? అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఈ క్రమంలో వెంటనే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విమానాలను లీజుకు ఇచ్చిన సంస్థలు జెట్ ఎయిర్ వేస్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వెంటనే లీజు దారులతో చర్చలు ప్రారంభించిన యాజమాన్యం.. సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆర్థిక సమస్యలు పరిష్కారమైన వెంటనే, బకాయిలను చెల్లిస్తామని పేర్కొంది.

ఇదే సమయంలో తమ లోటును భర్తీ చేసుకునేందుకు జెట్ ఎయిర్ వేస్.. బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని విమాన టికెట్ల పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 30శాతం డిస్కౌంట్ తో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో  విమాన టికెట్లను అందించనున్నట్లు జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. ఈ పండగ ఆఫర్ కొద్ది రోజులకు మాత్రమే వర్తిస్తుంది. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. హ్యాపీ దీపావళి సేల్ పేరిట ఈ ఆఫర్ ప్రకటించగా.. ఎకానమీ, ప్రీమియర్, ఇంటర్నేషనల్ టికెట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది.

ఈ విమాన టికెట్లను జెట్ ఎయిర్ వేస్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకనే అవకాశం ఉంది. వీటి ద్వారా టికెట్ బుక్ చేసుకున్నవారికి అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయి. టికెట్ బుక్ చేసుకొని ఏదైనా కారణంతో వాటిని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే... 24గంటలలోపు ఎలాంటి కటింగ్స్ లేకుండానే టికెట్స్ క్యాన్సిల్ చసుకోవచ్చని కూడా జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ దీపావళి మరింత ఆనందంగా జరుపుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles