Amritsar train accident and the aftermath ‘రైల్వే’ అనుమతి లేకపోవడమే విషాదానికి కారణమా.?

Police begin probe as train mows down 58 dussehra revellers in punjab

Amritsar, train accident, Dussehra, Dussehra celebrations, Ravana effigy, Hoshiarpur, Navjot Singh Sidhu, Navjot Kaur Sidhu, firecrackers, train, railway tracks, dussehra accident, Punjab

At least 61 people were killed and 72 injured after a crowd of Dussehra revellers that had spilt onto the railway tracks while watching the burning of Ravana effigy was run over by a train, officials said.

‘రైల్వే’ అనుమతి లేకపోవడమే విషాదానికి కారణమా.?

Posted: 10/20/2018 12:40 PM IST
Police begin probe as train mows down 58 dussehra revellers in punjab

పంజాబ్ లో దసరా పండుగ ఉత్సవాల సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటున్న భక్తులపై నుంచి రైలు వెళ్లి.. సుమారు 61 మంది ప్రాణాలను బలిగొని మరో 70 మందిని జీవన్మరణాల మధ్యకు నెట్టిన విషాదం వెనుక కారణాలు ఏంటీ.? ఇప్పటికే పోలీసులు ఈ విషాదఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంతో తమకేమీ సంబంధం లేదని, అసలు రైల్వేను తప్పపట్టాల్సిన అవసరమే లేదని అటు రైల్వే అధికారులు కూడా నోక్కివక్కాణిస్తున్నారు.

రైల్వే అధికారులకు దసరా ఉత్సవాలకు సంబంధించిన సమాచారం అందించిలేదని, ఒకవేళ అందించి వుంటే ఈ ప్రమాదం జరిగివుండేది కాదని రైల్వే అధికారులు తమ తప్పు లేదని వాదిస్తున్నారు. కనీసం రైల్వే పట్టాలపై ఉత్సవాలు జరుపుకుంటున్న క్రమంలో రైల్వే అధికారుల అనుమతి తీసుకోవాలన్న ప్రయత్నాలు కూడా జరగలేదని వారు పేర్కోంటున్నారు. ఈ కారణంగానే తమ వద్ద మృతుల వివరాలు కూడా లేవని అంటున్నారు రైల్వే అధికారులు. కాగా మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే పట్టాలకు కొంత దూరంలో రావణ దహనం జరుగుతుండగా.. దానిని పట్టాలపై నిల్చుని వీక్షిస్తున్న వారిపై నుంచి రైలు దూసుకెళ్లింది. అయితే వందల మంది రైలు పట్టాలపై వున్నా.. రైలు డ్రైవరు నిర్లక్ష్యంగా నడిపటంతోనే ప్రమాదం సంభవించిందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. వంద నుంచి రెండెందల మంది పట్టాలపైకి వచ్చినా.. వారిని పట్టించుకోకుండా రైల్వే డ్రైవర్ వాహనాన్ని ఎలా నడిపాడని.? కనీసం వారిని దూరం నుంచే పసిగట్టిన సమయంలో రైలు కొంచెం కూత పెట్టినా ప్రమాద తీవ్రత తగ్గేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ప్రమాదానికి కారణమైన డీఎంయూ 74943 రైలు ఆ ప్రాంతవాసులకు చిరపరిచతమే. హోషియాపూర్ నుంచి జలంధర్ వెళ్లే ఈ రైలులో చాలామంది స్వర్ణదేవాలయానికి వెళ్తుంటారు. ఈ రైలు సమయం అందరికీ తెలుసు. సాయంత్రం 6:50 గంటలకు జోడాపాఠక్‌కు చేరుకుంటుంది. అయితే, దసరా రోజున రైళ్లు ఈ ప్రాంతం గుండా నెమ్మదిగా ప్రయాణిస్తుంటాయి. దీంతో జనాలు భయం లేకుండా ట్రాక్‌లు దాటుతుంటారు. ప్రమాద సమయంలో మైకుల్లో పాటలు హోరెత్తుతుండడంతో రైలు వస్తున్న శబ్దం వినిపించలేదు.

రావణ దహనం సందర్భంగా పేలుతున్న పటాకుల నిప్పు రవ్వలు ఎగిరి పడుతుండడంతో అందరూ దూరంగా జరిగి పట్టాలపైకి చేరుకున్నారు. మరికొందరు సెల్ఫీలు తీసుకుంటూ బిజీ అయిపోయారు. బాణసంచా పేలుడు తప్ప వారికి రైలు వస్తున్న శబ్దం వినిపించలేదు. మరోవైపు రైలు కూడా హారన్ మోగించలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో రైలు వారి నుంచి దూసుకుపోయింది. 15 సెకన్ల వ్యవధిలోనే పెను ప్రమాదం జరిగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amritsar  train accident  Dussehra  fire crackers  train  railway tracks  dussehra accident  Punjab  

Other Articles