train driver says he got all-clear to move on పంజాబ్ లో దసరా ఉత్సవాల విషాదం

Entire families have been wiped out amritsar train accident eyewitness

Amritsar, train accident, Dussehra, Dussehra celebrations, Ravana effigy, Hoshiarpur, Navjot Singh Sidhu, Navjot Kaur Sidhu, firecrackers, train, railway tracks, dussehra accident, Punjab

“It took just about 10-15 seconds for the train to pass and leave behind a heap of crushed and dismembered bodies,” an eyewitness said.

ఆ 15 సెకండ్లే.. పంజాబ్ లో దసరా ఉత్సవాల విషాదం

Posted: 10/20/2018 12:06 PM IST
Entire families have been wiped out amritsar train accident eyewitness

దసరా పండగ ఉత్సవాల్లో భాగంగా పంజాబ్ లో జరిగిన తీవ్ర విషాదం అంతా కేవలం పది నుంచి 15 సెకన్ల మధ్య జరిగిపోయిందని ప్రత్యక్షసాక్షులు కన్నీళ్ల పర్యంతమవుతూ తీవ్ర విషాదఘటన వివరాలను తెలిపారు. అప్పటి వరకు అందరూ ఆనందోత్సాహాల మధ్య దసరా సంబరాలు నిర్వహించుకుంటున్నారు. అంతే అదే సమయంలో బాణాసంచా కాల్చుతుండగా రైలు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. అంతే అనందోత్సహాల మధ్యే విషాదం అలుముకుందన్నారు.

అమృత్‌సర్‌ సమీపంలోని జోడా పాఠక్‌ ప్రాంతంలో జరుగుతున్న రావణదహన కార్యక్రమాన్ని పక్కనే ఉన్న రైలు పట్టాలపై నిలబడి చూస్తున్న వారిపైకి రైలు దూసుకెళ్లడంతో కనీసం 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 70మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. క్షణాల్లో సంతోషాలు కాస్తా హాహాకారాలు, అర్థనాథాలుగా మారిపోయాయి. ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదం అలుముకుంది. జనసంద్రంగా మారిన ప్రాంతంలో శోకసంద్రంగా మారిపోయింది

కేవలం పది నుంచి పదిహేను సెకన్లలో ఘోరం జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. 15సెకన్లలో రైలు ఘటనా ప్రాంతం దాటేసిందని.. రైలు వెనక పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి పరిస్థితి భయానకంగా మారిపోయిందని తెలిపారు. బాణసంచా పేలుడు శబ్దాలకు రైలు చప్పుడు వినిపించలేదు.. అంతా రావణ దహనం చూస్తుండగా అకస్మాత్తుగా రైలు అక్కడి నుంచి దూసుకెళ్లిందని మరొకరు వెల్లడించారు.

సాధారణంగా రావణ దహన కార్యక్రమం త్వరగా పూర్తైపోయేదని, కానీ ఈ సారి ముఖ్యఅతిథి ఆలస్యంగా వచ్చారని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మామూలుగా సాయంత్రం 6.15కు రావణ దహనం నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. కానీ అతిథిగా వచ్చిన అమృత్‌సర్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ ఆలస్యంగా వచ్చారని, ఆమె కార్యక్రమంలో మాట్లాడిన తర్వాత రావణదహనం చేశారని తెలిపారు. రైల్వే ట్రాక్స్‌ వద్ద ఎలాంటి బారికేడ్స్‌ లేవని, అధికారులు, కార్యక్రమ నిర్వహకులు రైలు రాక గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు.

పెద్ద ఉత్సవాలు నిర్వహించేందుకు అది తగిన ప్రదేశం కాదని మరొకరు అభిప్రాయపడ్డారు. రైలు వచ్చే సమయం గురించి తెలియజేయకపోవడం ఉత్సవాల నిర్వహకుల తప్పు అని పేర్కొన్నారు. జోడా ఫాఠక్‌ ప్రాంతంలోని ఈ ఖాళీ స్థలంలో 20ఏళ్ల కిందటి నుంచి రావణ దహన కార్యక్రమం జరుగుతూ వస్తోందని, ఎన్నడూ ఇలాంటి దారుణ ఘటనలు చోటుచేసుకోలేదని స్థానికుడొకరు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amritsar  train accident  Dussehra  fire crackers  train  railway tracks  dussehra accident  Punjab  

Other Articles