Sabarimala temple opens gates for women శబరిమల వద్ద ఉద్రిక్తత.. మహిళా జర్నోలపై దాడి

Protests near sabarimala turn violent 2 female journalists injured

Lord Ayyappa, lady journalists, sabharimala women journo, Ayyappa swamy temple, Nilackal, women, protesters, kerala police, Sabrimala, sabrimala women, sabrimala kerala, Sabrimala temple, sabrimala entry, kerala goverment

Few minutes before Sabarimala temple gates were to open to all devotees, including women, after Supreme Court order Tensions are high in Kerala. Even women scribes were assaulted by protesters.

శబరిమల వద్ద ఉద్రిక్తత.. మహిళా జర్నోలపై దాడి

Posted: 10/17/2018 04:43 PM IST
Protests near sabarimala turn violent 2 female journalists injured

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇవాళే తొలిసారిగా కేరళలోని అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అయితే ఆలయంలోకి ప్రవేశించేందుకు అన్ని వయసుల మహిళలకు అనుమతినిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించడంతో తాము అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటామని మహిళా భక్తులు వెళ్లడం.. వారికి అందోళనకారులకు మధ్య ఉద్రిక్తత రాజుకుంది.

ఈ క్రమంలో పంబానది వద్ద అక్కడి పరిస్థితులను, వార్తలను కవర్ చేసి తమ ఛానెళ్లకు చెప్పేందుకు వచ్చిన జాతీయ మీడియా మహిళా జర్నలిస్టులను కూడా అందోళనకారులు అడ్డుకున్నారు. వారిని పట్టించుకోకుండా ముందకు వెళ్తున్న వారిపై అందోళనకారులు దాడులకు దిగారు. వారు ప్రయాణిస్తున్న కార్ల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. సుమారుగా నీలక్కల్ వద్ద వెయిమందికి పైగా పోలీసులు బందోబస్తు వున్నా అందోళనకారులు మాత్రం తమ అధిపత్యం ప్రదర్శించారు.

ఈ క్రమంలో ఉదయం ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు.. సరిగ్గా సాయంత్రం తలుపులు తెరుచుకునే సమయానికి కొన్ని గంటల ముందు అరెస్టులు కూడా చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు నీలక్కల్ వద్ద ఏకంగా 30 మంది అందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ దాదాపుగా 200 మంది మహిళా పోలీసులతో పాటు మొత్తంగా వెయ్యి మంది పోలీసులు మహిళాభక్తులకు రక్షణగా నిలిచారు. కాగా సన్నిధానం వద్ద కూడా సుమారుగా 500 మంది పోలీసులు వున్నా తమను పట్టించుకున్న వారెవ్వరూ లేరని మహిళా భక్తులు అరోపిస్తున్నారు.

శబరిమల ఆలయంలోకి తన కుటుంబసభ్యులతో కలసి వెళ్తేందుకు యత్నించిన ఏపీ మహిళ మాధవికి నిరాశ ఎదురైంది. ఆమెతో పాటు కుటుంబసభ్యులను నిరసనకారులు అడ్డుకున్నారు. వారిని చుట్టుముట్టిన నిరసనకారులు గట్టిగా అరుస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ, కొంత మంది పోలీసులు తమతో పాటు రక్షణగా వచ్చారని... అయితే ఆలయం సమీపిస్తున్న సమయంలో వారు వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు. నిరసనకారుల తీరుతో తమ పిల్లలు ఏడ్చేశారని చెప్పారు. ఇక చేసేదేమీ లేక వెనక్కి వచ్చేశామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sabrimala temple  Lord Ayyappa  Nilackal  women  protesters  kerala police  kerala goverment  

Other Articles