Ramulu naik dares KTR on allegations నిజమెవ్వరిదో తేల్చుకుందామా కేటీఆర్: రాములు నాయక్ సవాల్

Ramulu naik dares ktr on suspending allegations

ramulu naik, TRS suspended leader ramulu naik, TRS MLC ramulu naik, narayan khed, bhopal reddy, TRS, KTR, Narco analysis test, Telangana, Politics

TRS Suspended MLC Ramulu naik dares Minister KTR on suspending allegations, stating that he is ready if ktr too comes front for narco analysis test

నిజమెవ్వరిదో తేల్చుకుందామా కేటీఆర్: రాములు నాయక్ సవాల్

Posted: 10/17/2018 03:44 PM IST
Ramulu naik dares ktr on suspending allegations

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పార్టీ ఏర్పాటు నుంచి అన్ని వేళలా వెన్నంటే వుంటూ వచ్చిన తనపై టీఆర్ఎస్ అధిష్టానం వేటు వేయడాన్ని జీర్ణంచుకోలేని ఎమ్మెల్సీ రాములు నాయక్ టీఆర్ఎస్ పార్టీతో పాటు కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆది నుంచి పార్టీ వెన్నంటి ఉండి.. కష్ట కాలంలోనూ టీఆర్ఎస్ తోడుగా వున్న తనపై అనవసరపు అబంఢాలు వేసి.. పార్టీ నుంచి తప్పించేందుకు రంగం సిద్దం చేయడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అంతం ఖాయమని తాజాగా ఆయన వెల్లడించారు. నారాయణఖేడ నుంచి తాను ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానని, దమ్ముంటే భూపాల్ రెడ్డి కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఇద్దరిలో ఎవరికి ప్రజల అమోదం లభిస్తుందో చూద్దామని సవాల్ విసిరారు. నారాయణఖేడ్ లో తాను ఓడిపోతే ఉరేసుకుంటానని రాములు నాయక్ వ్యాఖ్యానించడం గమనార్హం. రేపటి నుంచి తనపై భౌతిక దాడులు చేయిస్తారని.. తనకేం జరిగినా టీఆర్ఎస్‌దే బాధ్యత అని చెప్పారు.

గోల్కొండ హోటల్లో తాను కాంగ్రెస్ నేతలను కలిసానని.. అదే తనను సస్పెండ్ చేయఢానికి కారణమని కూడా చెబుతున్న టీఆర్ఎస్ అరోపణలపై ఆయన విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ అరోపణల్లో నిజముందని వారు బావిస్తే.. తాము చెబుతోంది నిజమైతే నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్దమా? అని నాయక్ ప్రశ్నించారు. ఎవరు ఎవరితో కలిశారో దానితో తేలిపోతుందన్నారు. తెరముందు చెబుతున్న అబద్దాలకు.. తెర వెనుక సాగుతున్న పరిణామాలకు నార్కో అనాలసిస్ పరీక్షలే లింకులను బయటపెడతాయని అన్నారు.

ఓ గిరిజన నాయకుడినైన తనను పట్టుకుని సీఎం 'కిక్ ఆఫ్' అనడం.. మొత్తం దళిత, బీసీ, గిరిజన సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గోండులు-లంబాడాలు, యాదవులు-కురుములకు మధ్యన చిచ్చు పెట్టారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ 105సీట్లు కాదు కదా.. 25-30సీట్లకు మించి గెలవలేదని అన్నారు. కొత్త వాగ్దానాలతో కేసీఆర్ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramulu naik  narayan khed  bhopal reddy  TRS  KTR  Narco analysis test  Telangana  Politics  

Other Articles