janasena chief pawan steps into east godavari తూర్పులో అడుగెట్టనున్న జనసేనాని..

Janasena activists throng to dhavaleshwaram barriage for pawan kalyan

pawan kalyan, janasena, Dhavaleshwaram Barriage, mass march, Kavathu, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan east godavari, Pawan Kalyan kostandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan steps into East Godavari district with a Mass March at Dhavaleshwaram Barriage.

ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు కదులుతున్న జనసైనికులు

Posted: 10/15/2018 12:16 PM IST
Janasena activists throng to dhavaleshwaram barriage for pawan kalyan

ఆంధ్ర ప్రదేశ్ లో తృతీయ ప్రత్యామ్నాయ జనసేన పార్టీ.. తన ఉనికి చాటుకునే ప్రయత్నాలకు స్వస్తి పలికి.. రాష్ట్రంలో ఓ బలమైన రాజకీయ శక్తిగా, అవకాశం లభిస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత కింగ్ మేకర్ గా కూడా మారే అవకాశం కోసం ప్రయత్నాలను చేస్తుంది. ఇటు వామపక్ష పార్టీలతో కలసి ఈ సారి ఎన్నికలలో ప్రత్యక్షపోరులోకి దిగనున్ను పార్టీ.. ప్రజలకు నిస్వార్థ సేవను అందించడమే తమ పరమావధి అని చాటుతూ ముందకు కదులుతుంది. ఈ విషయాన్నే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా సిద్దమవుతుంది.

ఈ మేరకు ఇప్పటికే తమ జనసైనికులకు విషదీకరించిన జనసేనాని.. రాజకీయం కూడా పెద్ద వ్యాపారంగా మారిందని జనసేనాని పవన్ అందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు తరతరాలకు కావాల్సిన డబ్బులను పోగేసుకుని ప్రజలకు మాత్రం శఠగోపం పెడుతున్నాయని జనసేనాని అవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రజల్లోకి తామకు డబ్బు, పదవులపై వ్యామోహం లేదని, కేవలం ప్రజలకు నిస్వార్థ సేవలు అందించి రాష్ట్రా అభివృద్దికి దోహదపడాలన్నదే తాను పార్టీ స్థాపన ముఖ్యఉద్దేశ్యమని చెప్పారు.

ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ.. అక్కడి సమస్యలను అకళింపు చేసుకుంటున్న పవన్ కల్యాణ్.. అదే సమయంలో పార్టీని కూడా బలోపేతం చేసుకుంటున్నారు. అధికార, విపక్ష పార్టీల తప్పిదాలను ప్రశ్నిస్తూ.. తమ పార్టీ ఏం చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు ఎక్కడికక్కడ స్పష్టం చేస్తున్నాడు. అధికారంపై తనకు మోజు లేదని, అదే సమయంలో డబ్బు సంపాదించేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని తేల్చిచెప్పారు. తన కుటుంబానికి ఎంతో అదరించిన ప్రజలకు తాను సేవ చేసేందుకే వస్తున్నానని చెప్పారు.

అయితే పాలనలో పారదర్శకత, అవినీతి రహిత సమాజస్థాపన, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం.. పర్యావరణం పరిరక్షణ ఇలా తమ పార్టీ సిద్దాంతాలకు లోబడే తమ పార్టీ ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ఆయన తూర్పుగోదావరి జిల్లాలోకి పార్టీ అధినేతగా తన యాత్రలో భాగంగా అడుగుపెడుతున్నారు.  దీంతో రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు జరగనుంది. దీనిలో పాల్గొనేందుకు పెద్ద ఎతున్న అభిమానులు తరలివస్తున్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ పూర్తిగా జనసేన పతాకాలతో శ్వేతవర్ణమయమైంది.

ఈ మధ్యాహ్నం 3 గంటలకు పిచుకల లంక నుంచి జనసేవ కవాతు ప్రారంభం కానుంది. కాగా పవన్ కల్యాణ్ కూడా పోలీసులు అంక్షలు విధించారు. కేవలం 40 కార్లు మాత్రమే తన కాన్వాయ్ లో బాగంగా రావాలని చెప్పారు. అయితే అంతకు రెట్టింపు సంఖ్యలో అభిమానులు తమ కార్లలో పవన్ కల్యాణ్ ను ఫాలో అవుతూ పిచుకులలంక గ్రామానికి చేరుకుంటున్నారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసే బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  east godavari  dhavaleshwaram  kavathu  andhra pradesh  politics  

Other Articles