#MeToo India: Ministry to set up legal committee ‘మీటూ‘ ప్రకంపనలపై కదిలిన కేంద్రం.. కమిటీ ఏర్పాటు..

Panel of senior judges to look into metoo cases says maneka gandhi

maneka gandhi, metoo movement, metoo campaign, mj akbar, sexual harassment, sexual harassment against women, women exploitation, metoo india, mj akbar, pannel judges, legal experts, metoo cases, crime

The #MeToo movement has gathered steam over the last fortnight with scores of women speaking out on sexual harassment at the workplace and support pouring in from various quarters.

‘మీటూ‘ ప్రకంపనలపై కదిలిన కేంద్రం.. కమిటీ ఏర్పాటు..

Posted: 10/12/2018 08:29 PM IST
Panel of senior judges to look into metoo cases says maneka gandhi

హాలీవుడ్ లో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం ఇటు భారత్ లో అన్ని రంగాలకు విస్తరిస్తోంది. గత పక్షం రోజులుగా తాము ఎదుర్కోన్న వేధింపులను వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళామణులు వెల్లడించారు. నానా పటేకర్ పై తనుశ్రీదత్త చేసిన అరోపణల నుంచి ప్రారంభమైన ఈ వేధింపులు అలోక్ నాథ్, గేయ రచయిత వైరముత్తు, నవలా రచయిత చేతన్ భగత్, టాటా మోటార్స్ ఉన్నతాధికారి సురేశ్ రంగరాజన్, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ ఇలా చాలామందినే చుట్టేశాయి.

ఇక తాజాగా కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనమిది మంది మహిళలు బయటికి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఇరుకునపడింది. దీంతో దిట్టుబాటు చర్యలకు పూనుకుంటున్న కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఎట్టకేలకు కదిలింది. మహిళా బాధితుల నుంచి అరోపణలు ఎదుర్కెంటున్న పలువురు ప్రముఖలను విచారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు.

ఈ కమిటీలో నలుగురు విశ్రాంత న్యాయమూర్తులతో పాటు న్యాయకోవిదులు కూడా వుంటారని అమె తెలిపారు. వీరు మీటూ పిర్యాదులపై విచారణ నిర్వహించే ఏర్ాపటును చేస్తామని అమె తెలిపారు. లైంగిక వేధింపుల అరోపణలు చేస్తున్న మహిళలందరి పట్ల తనకు నమ్మకముందని అన్నారు.  ప్రతి ఫిర్యాదు వెనుక ఉన్న బాధ, గాయాలను తాను నమ్ముతున్నానని తెలిపారు. మహిళలు తమపై జరిగిన అకృత్యాలను ధైర్యంగా బయటపెట్టడం సంతోషంగా ఉందని మేనకా గాంధీ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maneka gandhi  metoo movement  metoo india  mj akbar  pannel judges  legal experts  metoo cases  crime  

Other Articles