Pawan Kalyan says his party is ready for panchayat elections పంచాయతీ ఎన్నికలు మేం రెడీ.. మరీ మీరు.? పవన్

Pawan kalyan says his party is ready for panchayat elections

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, west godavari, panchayat elections, surpanch post, nara lokesh, pawan kalyan sattires on nara lokesh, Pawan Kalyan kostandhra yatra, Pawan Kalyan west godavari, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan question the ruling party and opposition party are they ready for panchayat elections. and also sattires Nara Lokesh by critisizing that he will not even win sarpanch post.

పంచాయతీ ఎన్నికలు మేం రెడీ.. మరీ మీరు.? నిలదీసిన పవన్

Posted: 10/09/2018 11:19 AM IST
Pawan kalyan says his party is ready for panchayat elections

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. తన దూకుడును పెంచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమ పార్టీ సిద్ధమేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంసిద్దత వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు కూడా పంచాయితీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారని అన్నారు, మరి, అధికార పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత జగన్ సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు.

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో ఆడపడుచులకు అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల లోపు కొయ్యలగూడెంను నగర పంచాయతీగా ప్రకటించాలని పవన్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

జనసేన పార్టీ అధికారంలోకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గిరిజన, గిరిజనేతర యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆడపడుచుల కష్టం తెలుసుకుని ’ఉచిత గ్యాస్ పథకం’ పెట్టానని అన్నారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. లోకేష్ కనీసం సర్పంచ్ గా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు. 'విప్ పదవి నుంచి చింతమనేనిని తొలగిస్తారా.. లేదా?.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాయమంటారా?' అంటూ పవన్‌‌ నిలదీశారు.

ప్రాజెక్టుల నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన పవన్, అధికారంలోకి వస్తే జగన్ కు సంబంధించిన దోపిడీ వ్యవస్థను తీసుకురాబోమని స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పవన్  స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే జనసేన బలపడుతుందనే భయం ప్రభుత్వానికి ఉందన్నారు. కౌలురైతులకు అండగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో జనసేన జెండా ఉందని ఆయన చెప్పారు. గ్రామాలకు నిస్వార్థంగా పనిచేసే సర్పంచ్ లు కావాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  west godavari  nara lokesh  panchayat elections  andhra pradesh  politics  

Other Articles