kondagattu victims does't recieve compensation కొండగట్టు బాధితులకు అందని పరిహారం..

Kondagattu victims does t recieve a single ruppee compensation

Telangana Kondagattu bus, Telangana Kondagattu bus tragedy, telangana bus crash, Telangana bus accident, Telangana bus death toll, Kondagattu, Driver Srinivas, Unfit Bus, TSRTC, bus tragedy, telangana, compensation, Telangana, crime

Even after a month of the biggest RTC Tragedy that took place in karimnagar kondagattu Ghat Road, the victims and their families had not recieved a single ruppee as compensation from the government.

కొండగట్టు బాధితులకు అందని పరిహారం..

Posted: 10/09/2018 12:07 PM IST
Kondagattu victims does t recieve a single ruppee compensation

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ రోడ్డులో సంభవించిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 63కు చేరింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన ఆరెపెల్లి లింగవ్వ(70) కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. లింగవ్వ మృతితో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 63కు చేరింది. ఇదిలా వుంటే ఈ ప్రమాదం జరిగి దాదాపుగా నెల రోజులు కావస్తున్నా.. బాధిత కుటుంబాలకు మాత్రం ఒక్క రూపాయి కూడా పరిహారం లభించలేదు.

ప్రమాదంలో మృతులు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ.రెండున్నర లక్షల పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటన చేసిన క్రమంలో తమకు చికిత్స నిమిత్తం డబ్బులు వస్తాయని వేచిచూసిన బాధితులకు నెల రోజులు కావస్తున్నా ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. అయితే తాజాగా ఎన్నికల కోడ్ అమల్లో వుందన్న సమాచారంతో ప్రభుత్వం ఈ ఫైల్ పై సంతకాలు పెట్టలేదని తెలుస్తుంది. అయితే అంతకుముందే ఈ ఫైల్ పై సంతకం పెట్టివుంటే.. బాధితకులకు అసరాగా వుండేదన్న పలు సూచనలు కూడా వినిపిస్తున్నాయి.

గత నెలలో శాసనమండలికి అపధర్మ ముఖ్యమంత్రి హోదాలో హాజరైన సీఎం కేసీఆర్.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ సేవలను గుర్తించి ఆయనకు ఏకరం స్థలంలో స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన క్రమంలో నిద్రలేచిన ఎన్నికల కమీషన్.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో వుందని చెప్పింది. అప్పటి వరకు ప్రభుత్వం తమకు కావాల్సిన పనులను చక్కబెట్టుకుంది. అయితే అదే సమయంలో కొండగట్టు బాధితుల ఫైల్ పై కూడా కేసీఆర్ సర్కార్ సంతకం చేసివుండి వుంటే బాధితులకు ఇంత అంగలార్పు వుండేది కాదన్న గుసగుసలు కూడా వినబడుతున్నాయి.

జాప్యానికి అసులు కారణమేంటీ.?

ఈ ప్రమాదానికి సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్‌ గత నెల 19న రాష్ట్ర సచివాలయానికి పంపారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఆపద్బంధు కింద రూ.50 వేలు మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉండటంతో ఆ దస్త్రాన్ని సీఎం సహాయ నిధికి పంపించారు. అప్పటి నుంచి దస్త్రం ఆ విభాగంలోనే ఉండిపోయింది. పరిహారం మంజూరీ ఉత్తర్వులపై సీఎం సంతకం చేయాల్సి ఉండగా ఎన్నికల నియమావళి(కోడ్‌) అడ్డంకిగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 11తో ఈ ప్రమాదం జరిగి నెల రోజులు పూర్తవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kondagattu  Driver Srinivas  Unfit Bus  TSRTC  bus tragedy  telangana  compensation  Telangana  crime  

Other Articles