HC Postpones Verdict on telangana voters’ list బోగస్ ఓటర్ల కేసు విచారణ.. 8కి వాయిదా

Hc postpones verdict on telangana voters list to monday

KCR, TRS, Congress, Marri Shashidhar Reddy, Uttam Kumar Reddy, Supreme Court, High Court, Election commission, stay on voters list, bogus voters, voters list, telangana, politics

Amid the continuing row over the electoral rolls of Telangana, High Court Postpones Verdict to monday, and orders EC to file counter affidavit in this regard. And stays listing of voters list on EC website.

ITEMVIDEOS: ఓటర్ల జాబితా ప్రకటనపై సోమవారం వరకు స్టే

Posted: 10/05/2018 04:46 PM IST
Hc postpones verdict on telangana voters list to monday

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను శుక్రవారమే విచారణ జరపి.. అవసరమైన నేపథ్యంలో ఎన్నికలతో పాటు.. ఎన్నికల జాబితా విడుదలపై కూడా స్టే విధించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశించిన క్రమంలో ఇవాళ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఆయన దాఖలు చేసిన రెండు పిటీషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం వీటి తదుపరి విచారణను సోమవారానికి (ఈ నెల 8కి) వాయిదా వేసింది.

మొత్తంగా నాలుగు పిటీషన్లు దాఖలు కాగా వాటిలో రెండు పిటీషన్లను ఇవాళ కొట్టివేసిన హైకోర్టు.. మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపింది. విచారణ పూర్తయ్యే వరకు తుది ఓటర్ల జాబితాను ప్రకటించవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. సోమవారం ఈ పిటిషన్ తోపాటు మరో రెండు పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమీషన్ తరపు న్యాయవాదికి మర్రి శశిధర్ రెడ్డి పిటీషన్ పై కౌంటర్ పిటీషన్ దాఖలు చేయాలని అదేశాలు ఇచ్చింది.

ఈ సందర్భంగా మర్రి శెశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ., రానున్న ఎన్నికలలో తమకు వ్యతిరేకంగా ఓటు వేసే వారి ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించి.. ఏకపక్షంగా దొంగమార్గంలో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన అరోపించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంత ప్రజల ఓట్లను తీయడంతో దానిని గమనించి అక్షేపించి.. ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువచ్చిన క్రమంలో వాటిని తిరిగి జాబితాలో పొందుపర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ సారి కూడా అదే వక్రమార్గాన్ని అందుకుని ఎన్నికలలో గెలిచేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని అరోపించారు. జెమిలీ ఎన్నికలు కావాలని మొన్నటి వరకు గళమెత్తిన ఈ సీఎం.. ఒక్కసారిగా తమ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని, పార్టీలో అసమ్మతుల రాగం కూడా పెరుగుతుందన్న క్రమంలో ముందస్తు రాగాన్ని అలపించారని శశిధర్ రెడ్డి విమర్శించారు. తోటి ముఖ్యమంత్రిపై ఆయన వాడిన పదజాలం.. రాజకీయాలలో వున్న ఏంతటి నేతలు కూడా వాడరని.. ఇది వారికే అప్రతిష్ట అని విమర్శించారు.

అయితే ఈ కేసులో తుది తీర్పును వచ్చే వరకు జాబితా ప్రకటన సహా ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్డును కూడా నిలిపివేయాలని న్యాయస్థానం అదేశాలను జారీ చేసిన విషయాన్ని కూడా చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్థంభగా వున్న ఎన్నికల ప్రక్రియలో ప్రతీ ఓక్కరూ ఓటు హక్కును పొందాలని తాను, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తున్నామని అన్నారు. ఓట్లను తొలగించి కేసీఆర్ అక్రమంగా ఎన్నికలకు వెళ్లకూడదనే తాము ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  TRS  Congress  Marri Shashidhar Reddy  Election Commission  High Court  telangana  politics  

Other Articles