sexual harrasment on married woman in borabanda వివాహితకు లైంగిక వేధింపులు.. కోరిక తీర్చాలని..

Sexual harrasment on married woman in borabanda

Sexual harrassement, mobile shop, borabanda site 2, jaffer, police complaint, arrest, hyderbadad, crime

A married woman of borabanda sexually harrassed by a mobile shop worker, after hacking her phone through spying software

వివాహితకు లైంగిక వేధింపులు.. కోరిక తీర్చాలని..

Posted: 10/06/2018 10:47 AM IST
Sexual harrasment on married woman in borabanda

సెల్ ఫోన్‌ సాంకేతిక లోపంతో మొరాయించడంతో బాగు చేయించుకుందామని మోబైల్ రిపేరింగ్ షాపుకి వెళ్లడం ఆమె పొరపాటయింది. సెల్ ఫోన్ రిపేరు అయ్యింది కానీ ఆ తరువాత నుంచి అమెకు.. అక్కడి ఓ ప్రబుద్దుడి నుంచి లైంగిక వేధింపులు మొదయ్యాయి. అందుకు కారణం సెల్ పోన్ లో ఆ ప్రబుద్దుడు హ్యాకింగ్ సాప్ట్ వేర్ వేయడమే. ఈ విషయం తెలియని ఆ వివాహితకు కొన్నాళ్లుగా మానసిక వేదన అనుభవిస్తున్న బాధితురాలు విసిగిపోయి పోలీసులను ఆశయ్రించింది.

దీంతో సదరు యువకుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన హైదారాబాద్ నగరం బోరబండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఓ వివాహిత తన సెల్‌ఫోన్‌ పనిచేయక పోవడంతో అమె నివసిస్తున్న బోరబండ సైట్‌-2కు చేరువలో వున్న సిటీ మొబైల్స్‌ అనే షాపులో  మరమ్మతుకు ఇచ్చింది. రెండు రోజులపాటు సెల్‌ఫోన్‌ తనవద్దే ఉంచుకున్న దుకాణదారుడు నఫీస్‌ అలియాస్‌ జఫర్‌ సెల్‌ఫోన్‌లో సమాచారాన్ని హ్యాక్‌చేసే సాఫ్ట్‌వేర్‌ ఉంచి ఆమెకు ఇచ్చాడు.

అనంతరం తానుంచిన సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా సదరు గృహిణి మాట్లాడే సంభాషణలు, వాట్సాప్‌ సమాచారం, వీడియోలు, చాటింగ్‌ సమాచారాన్ని దొంగిలించాడు. వాటి ఆధారంగా ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. తనను పెళ్లి చేసుకోవాలని, కోరిక తీర్చాలని, తన మాట వినకుంటే సెల్‌ఫోన్‌లోని సమాచారం సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బాధితురాలిని మోతీనగర్‌లోని  ఓ పార్క్‌ వద్దకు రమ్మని చెప్పి అక్కడ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sexual harrassement  mobile shop  borabanda site 2  jaffer  police complaint  arrest  hyderbadad  crime  

Other Articles