janasena warns to stop insulting uttarandhra slang మరో ప్రత్యక రాష్ట్ర ఉద్యమానికి అదే కారణమౌతుంది: పవన్

Pawan kalyan warns to stop insulting uttarandhra slang

pawan kalyan, janasena, Uttarandhra language, uttarandhra slang, guntur, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, Pawan Kalyan uttatandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan warns politicians to stop insulting uttarandhra language and slang, which may lead to another seperate state movement.

మరో ప్రత్యక రాష్ట్ర ఉద్యమానికి అదే కారణమౌతుంది: పవన్

Posted: 10/05/2018 11:48 AM IST
Pawan kalyan warns to stop insulting uttarandhra slang

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం అక్రమంగా గనుల తవ్వకాలు చేపట్టడం ఆపకపోతే.. తీవ్ర పరిణమాలను చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేయడం.. ఆ తరువాత ఆరుమాసాల్లోని అలాంటి ఘటనలు చోటుచేసుకున్న క్రమంలో జనసేనాని మాటల వెనుక అంతర్యం, అందోళనలో అర్థముందని రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరోమారు రాష్ట్ర విభజన జరిగే ప్రమాదం కూడా లేకపోలేదని అందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉమ్మడి అంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడానికి భాష, యాసను అవమానించడం కూడా ఒక కారణమని ఆయన పేర్కోన్నారు. దానివల్ల తెలంగాణ ప్రజల మనసులు తీవ్రంగా గాయపడ్డాయని వెల్లడించారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర పట్ల అదేరకమైన వివక్ష కొనసాగుతోందనీ, వారి భాషను, యాసను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే మరోసారి రాష్ట్ర విభజన తప్పకపోవచ్చని హెచ్చరించారు. ఒకరి భాష, యాసను అపహాస్యం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు.

‘మన దేశ భాషల యాసలను అగౌరవపరిచి, అపహాస్యం చేయడం కారణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ చర్యలు అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని సహజవనరులు ఉన్నా వెనుకబాటుకు గురవుతున్నారు. నాయకులు అన్ని రంగాల్లో బాగుపడుతున్నా ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర భాష, యాసలను అపహాస్యం చేయడం తగదు’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఇలాంటి చర్యలు ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమానికి నాంది పలుకుతాయని పవన్ పరోక్షంగా హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Uttarandhra language  uttarandhra slang  guntur  andhra pradesh  politics  

Other Articles