'Narendra Modi' duplicate campaigns for Congress బీజేపికి షాక్.. కాంగ్రెస్ కు ప్రచారం చేయనున్న ‘మోడీ’

Narendra modi walks into congress headquarters all hell breaks loose

Narendra Modi, PM Modi, Lok Sabha Elections 2019, Abhinandan Pathak, Rahul Gandhi, Raj Babbar, Sonia Gandhi, uttat pradesh, union goverment

PM Modi’s look-alike, Abhinandan Pathak, has decided to join hands with Congress in protest against the saffron party’s unfulfilled promises.

బీజేపికి షాక్.. కాంగ్రెస్ కు ప్రచారం చేయనున్న మోడీని పోలిన వ్యక్తి

Posted: 10/05/2018 12:35 PM IST
Narendra modi walks into congress headquarters all hell breaks loose

నరేంద్రమోదీకి వీరాభిమాని, అందుకు తోడు అచ్చంగా ఆయనలా పోలి ఉండే ముఖవచ్చసు దీంతో ఆయన కూడా ప్రధాన మంత్రిలానే పలు నియోజకవర్గాలు పర్యటించి బీజేపి తరపున ప్రచారం చేసి కాషాయ పార్టీ విజయానికి దోహదపడ్డాడు.. అభినందన్ పాఠక్. అలాంటి పాఠక్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి ఆయన గతానికి బిన్నంగా వార్తల్లో వ్యక్తిగా మారిం తన ప్రధాని స్వామి భక్తికి, బీజేపీకి షాకిచ్చారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించాడమే ఇందుకు కారణం.

ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్ పూర్ కు చెందిన ఆయన ఈ ఏడాది మార్చిలో జరిగిన గోరఖ్ పూర్ ఉప ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. అయినా అక్కడ మాత్రం ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి గెలుపు సాధించాడు. తాను ఇంతగా ప్రచారం చేసినా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎలా గెలుపొందాడన్న విషయాన్ని సంహావలోకనం చేసుకున్న ఆయన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కోనసాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర మనస్తాపం చెంది కాంగ్రెస్ లో చేరి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు.

ప్రధాని నరేంద్రమోదీకి వీరభక్తుడిగా కొనసాగిన తాను ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, అయితే ఆయన ప్రస్తుత పాలన తాను ఊహించనదానికి తద్భిన్నంగా వుందని.. దేశంలోని ప్రజలు ఎవ్వరూ ఆయన పాలనపై సంతృప్తిగా లేరని పాఠక్ ఆవేదన వ్యక్తం చేశారు. తానెక్కడికి వెళ్లినా ‘అచ్చే దిన్ కబ్ ఆయేంగే’ (మంచి రోజులు ఎప్పుడొస్తాయ్) అని ప్రజలు తనను నిలదీస్తున్నారని, తాను బీజేపికి మద్దతు తెలపడమే తన పాలిట శాఫంగా మారిందని.. ప్రజల నిలదీతలు, అవమానాలు, చిత్కారాలను కూడా చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసి చాలా పెద్ద పొరపాటు చేశానని, ఈసారి మాత్రం ఆ తప్పు చేయబోనని, బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌ కు అనుకూలంగా ప్రచారం చేస్తానని తేల్చి చెప్పారు. తాను ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్‌ను కలిశానని, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన మాటిచ్చారని పాఠక్ చెప్పారు. ఇప్పుడు తాను కాంగ్రెస్ తో పనిచేయాలని నిర్ణయించుకున్నానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Abhinandan Pathak  Rahul Gandhi  Raj Babbar  Sonia Gandhi  uttat pradesh  

Other Articles