HC to hear petition on irregularities in voters’ list ఓటర్ల జాబితా, బోగస్ ఓటర్లపై రేపే విచారణ

Hc to hear petition on alleged irregularities in telangana voters list on friday

KCR, TRS, Congress, Marri Shashidhar Reddy, Uttam Kumar Reddy, Supreme Court, High Court, bogus voters, voters list, telangana, politics

Amid the continuing row over the electoral rolls of Telangana, Supreme Court directed the Hyderabad HC to hear the matter and if any irregularities were found it can extend the date of publication of the final list of voters.

ఓటర్ల జాబితా, బోగస్ ఓటర్లపై రేపే విచారణ

Posted: 10/04/2018 06:18 PM IST
Hc to hear petition on alleged irregularities in telangana voters list on friday

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను రాష్ట్రోన్నత న్యాయస్థానంలో దాఖలు చేయాలని సూచించింది. తెలంగాణలో 68 లక్షల బోగస్ ఓట్లను తొలగించకుండా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీనిని విచారణకు స్వీకరించేందుకు నిరాకరించిన న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టులో పరిష్కారించుకోవాలని అదేశిస్తూ ఈ క్రమంలో పలు సూచనలు చేసింది.

శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించిందని ఆయన తరపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తెలిపారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను రేపే విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ఒకవేళ ఎన్నికల ప్రక్రియపై స్టే విధించాల్సి వస్తే.. ఆ అధికారం హైకోర్టుకు ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఎన్నికలపై స్టే విధించాల్సి వస్తే ఆ అధికారం హైకోర్టుకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

బోగస్ ఓట్లను తొలగించకుండా ఎన్నికలకు వెళుతున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్.. ఈ ఓట్ల వ్యవహారం తేలేవరకూ ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. అంతేకాకుండా ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ఓటర్ జాబితా సవరణకు సోమవారం వరకే గడువు మిగిలిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది.

దీంతో శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలలోపు పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లను శుక్రవారమే విచారించాలని సుప్రీం న్యాయస్థానం హైకోర్టును ఆదేశించింది. తెలంగాణలో ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను ఇక కొత్తగా లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్ కు జస్టిస్ సిక్రీ ధర్మాసనం సూచించింది. ఎన్నికలకు సంబంధించిన పిటిషనర్ అభ్యంతరాలను ఇప్పటికే హైకోర్టు విచారించి కొట్టేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles