Excise duty on petrol, diesel slashed by Rs 2.50 ఇంధన ధరలపై రూ.1.50 తగ్గించిన కేంద్రం.. అయిల్ కంపెనీలు మరో రూపాయి

Excise duty on petrol diesel slashed by rs 2 50

Arun Jaitley, Arun jaitley press briefing, Arun Jaitley press conference, Dharmendra Pradhan, direct tax collections, finance ministry, fuel prices, high fuel prices, FS crisis, liquidity, oil minister Dharmendra Pradhan, GST

Finance Minister Arun Jaitley announced a cut of R s 2.50 percent in fuel prices. "Oil marketing companies will absorb Rs 1 from the central govt cut on 2.50 relief on petrol and diesel," he said.

ఇంధన ధరలపై రూ.1.50 తగ్గించిన కేంద్రం.. అయిల్ కంపెనీలు మరో రూపాయి

Posted: 10/04/2018 05:52 PM IST
Excise duty on petrol diesel slashed by rs 2 50

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న క్రమంలో వాహనదారులపై ఎట్టకేలకు కరుణ చూపింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎక్సైజ్ సుంఖాన్ని భారీగా పెంచిన కేంద్రం.. సుమారుగా ఏడాది క్రితం రూ. 2 తగ్గించి ఉపశమనం కల్పించింది. కాగా, మళ్లీ సెంచరీ దిశగా ఇంధన ధరలు పరుగులు పెడుతున్న క్రమంలో మళ్లీ ఇన్నాళ్లకు వాహనదారులపై కేంద్రం మరో రెండున్నర రూపాయలు తగ్గింది ఊరట కల్పించింది.

నాలుగేళ్లలో కేంద్రం విధించిన పన్నులో ఇంకా తొమ్మిది రూపాయల మేర తగ్గించాల్సి వున్నా.. కేంద్రం మాత్రం అంతర్జాతీయంగా ధరలు పెరిగిపోతున్న అంశాన్ని చూపుతుంది. అయినా ఈ తరుణంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లీటరు పెట్రోల్, డీజిల్ పై రూ. 2.50 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన చెప్పారు.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని, ద్రవ్యలోటు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. చమురు ధరలపై రాష్ట్రాలు కూడా కొంత పన్నులు తగ్గించుకోవాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కారణంగా కేంద్ర ప్రభుత్వం రూ.10,500 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుందని చెప్పారు. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, రూపాయ బలహీన పడటం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు.  

అయితే అరుణ్ జైట్లీ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తుండగా, ఆయన వినతిని కూడా పరిగణలోకి తీసుకున్న అనేక బీజేపి పాలిత రాష్ట్రాలు.. ఇంధన ధరలపై బ్యాట్ ను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం నాలుగేళ్లలో పెంచిన మొత్తాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. రూ.1.5 తగ్గింపుతో పది వేల 500 కోట్ల నష్టపోతున్నామన్న కేంద్రం.. ఇంధన ధరలపై రూ. 13 పెంచి ఎంత మేర లాభాన్ని అర్జించిందని ప్రశ్నిస్తున్నారు. ఇక కేంద్రం కేవలం రూపాయిన్నర తగ్గించగా, ఇంధన కంపెనీలు మరో రూపాయి నష్టాన్ని భరించనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  slashed  Rs.2.5  Arun Jaitley  Dharmendra Pradhan  

Other Articles