Fourth class employee salary creates sensation on social media

Diskum, Genco, Kola venkata ramanamma, salary, One and half lakhs, rajamahendravaram, viral news, social media, whatsapp, electricity department, Andhra pradesh

Recently a post has gone viral in Whatsapp. It's about a rajahmundry electricity lady employee who serves as sweeper, its clear upto now, but her salary pay slip makes all the buzz on social media. As she is drawing Rs.1.5 Lakhs as her salary pm.

ఆ స్వీపర్ నెల జీతం రూ. లక్షన్నర

Posted: 10/03/2018 07:02 PM IST
Fourth class employee salary creates sensation on social media

ఇంజనీరు జీతానికి, ఆఫీస్ ఊడ్చే స్వీపర్ జీతానికి ఎంత తేడా వుంటుంది ? నింగికి నేలకున్నంత తేడా వుంటుంది. పైగా వాళ్ళది గౌరవప్రదమైన ఉద్యోగం. వీళ్లది మాత్రం నిత్యం ఛీత్కారాలు, అధికారుల వేధింపులకు తోడు చాలీచాలని జీతాలతో జీవితాలు వెలగబడుతుంటాయి. కానీ ఓ స్వీపర్ నెల జీతం లక్షన్నర తీసుకుంటోంది. ఏంటి లక్షన్నరే.. ఫేక్.. ఇది పక్కా వాట్సాప్ పుకారు… అని అనుకోవచ్చు. అయితే ఇది వాట్సాప్ న్యూసే కానీ నిజం. ఆ స్వీపర్ అక్షరాలు లక్షన్నర జీతం తీసుకుంటున్నది నిజమే అని అధికారులు తేల్చారు. ఎవరా స్వీపర్, ఏంటా కథ..?

ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రవరం (రాజమండ్రి)కి చెందిన ఆ స్వీపర్ పేరు కోల వెంకటరమణమ్మ. ఆమె ఇప్పుడు నెల వేతనం లక్షన్నర రూపాయలు. ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం. వాట్సాప్‌లో ఆమె పేస్లిప్ చక్కర్లు కొట్టినంత మాత్రానా అబద్ధం కాదు.  ఆమె జీతం… రూ.1,47,722. ఆమెలా లక్షకుపైగా జీతం తీసుకుంటున్న వారు డిస్కమ్‌లలో చాలామందే ఉన్నారు.

ఎలా సాధ్యమైంది ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు విద్యుత్ శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు పోయి జెన్‌కో, ట్రాన్స్‌‌కోలు ఏర్పడ్డాయి. ఫలితంగా ట్రాన్స్‌‌కోలో మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్‌లు ఏర్పాటు చేశారు.సంస్కరణల నేపథ్యంలో ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ ఇవ్వడాన్ని ఆపేశారు.  దీంతో ఉద్యోగుల్లో ఆందోళన తలెత్తింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు అప్పటి ప్రభుత్వం భారీ ఎత్తున వేతనాలు పెంచింది. ఇంక్రిమెంట్లు కూడా అదే స్థాయిలో నిర్ణయించింది. సంస్థలోని ఉద్యోగస్తులందరితో స్వీపర్లు కూడా మంచి జీతం పొందుతున్నారు. వారి జీతం ఐదెంకలు దాటి ఆరంకెల్లోకి చేరింది.  

మంచి పనిమంతురాలు కోల వెంకటరమణమ్మ…

రాజమహేంద్రవరం తాడితోట ప్రాంతానికి చెందిన కోల వెంకటరమణమ్మ 1978లో 16వ ఏటనే విద్యుత్తు శాఖలో రోజువారీ ఉద్యోగిగా చేరారు. ఆమె తల్లి కూడా అక్కడే స్వీపర్‌గా పని చేసేవారు. 1981 ఏప్రిల్‌ 1న రమణమ్మ పర్మినెంట్‌ ఎంప్లాయ్‌ అయ్యారు. 40 సర్వీసును పూర్తిచేశారు. రిటైర్‌మెంట్‌కు మరో నాలుగేళ్లు ఉంది. సీనియారిటీ, మంచి పనిమంతురాలు అవడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చిందామెకు. రమణమ్మ ఉదయం 8 గంటలకు భోజనం డబ్బాతో వచ్చి… రాత్రి 8 గంటలకు ఇంటికి వెళతారు. ఆమె ఏమీ చదువుకోలేదు. కేవలం సంతకం పెట్టేంతే చదువుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kola venkata ramanamma  salary  rajamahendravaram  viral news  social media  whatsapp  Andhra pradesh  

Other Articles