EC gives shock to telangana goverment తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ షాక్..

Ec orders telangana goverment not to distributes free bathukamma sarees

election commission, rythu bandhu, bathukamma sarees, Rs.4000 per acre, telangana goverment

telangana goverment has recieved a shock from election commission, orders KCR government to not to disribute bathukamma sarees

బతుకమ్మ చీరల పంపకంపై తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ షాక్..

Posted: 10/04/2018 11:49 AM IST
Ec orders telangana goverment not to distributes free bathukamma sarees

తెలంగాణలో ఈ నెల 9 నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చీరలను సిరిసిల్ల నుంచి కాకుండా మహారష్ట్ర నుంచి తీసుకువస్తున్నారని.. మార్గమధ్యంలో లారీ బోల్తాపడటంతో ఈ విషయం బాహ్యప్రపంచానికి వెల్లడైందని కానీ ప్రభుత్వం మాత్రం సిరిసిల్ల చీరలను పేర్కోంటూ తాము నేతలన్న శ్రేయస్సుకు కోసం పాటుపడుతున్నామని బడాయిలకు పోతుందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తునే వున్నారు.

అయితే, ఊహించని రీతిలో తెలంగాణలోని కేసీఆర్ సర్కారుకు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. బతుకమ్మ చీరల పంపిణీని ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిలిపివేయాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో బతుకమ్మ చీరల పంపిణీ నిలిచిపోనుంది. పండగలోగా కోటి చీరల పంపిణీకి తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేసుకుంది. రూ.250 కోట్ల ఖర్చుతో వీటి పంపిణీకి సిద్ధపడింది. ఇప్పటికే యాభై లక్షల చీరలు పలు జిల్లాలకు చేరుకున్నాయి.  

అయితే ఇదే సమయంలో మరో షాక్ కూడా తెలంగాణ సర్కారుకు ఎన్నికల కమీషన్ నుంచి తగలనుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రైతులకు ఈ ఏడాది మొదట్లో ఇచ్చినట్లుగానే ఏకరానికి నాలుగు వేల రూపాయలను పంఫిణీ చేయాలని.. ఈ నెలలోనే సుమారు 50 లక్షల మందికి చెక్కులను పంఫిణీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్దమయ్యిందని నిన్న నిజామాబాద్ సభలో అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రోజునే ఎన్నికల కమీషన్ చీరలను పంఫిణీ వద్దని అదేశించిన క్రమంలో ఇక త్వరలోనే చెక్కుల పంఫిణీపై కూడా ఇదే తరహా అదేశాలు జారీ కానున్నాయని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles