Tdp leaders behind MLA's brutal Murder అరకు ఎమ్మెల్యే హత్యలో టీడీపీ నేతల హస్తం

Shocking local tdp leaders who pawned mla former mla killing

Araku MLA, Kidari Sarveswara Rao, Araku former MLA, Siveri Somu, Local TDP leaders, TDP, Maoists, andhra pradesh, crime

Police investigation in killings of Araku MLA Kidari Sarveswara Rao and ex MLA Siveri Soma by Maoists, bringing out more shocking details, as a TDP local leader and MPTC has played crucial role behind the brutal attack.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యలో టీడీపీ నేతల హస్తం

Posted: 10/01/2018 01:24 PM IST
Shocking local tdp leaders who pawned mla former mla killing

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య కేసులో పోలీసులు రాబట్టిన కీలక సమాచారం విస్మయాన్ని కలిగిస్తుంది. కిడారి సర్వేశ్వర రావు, సివేరి సోమల హత్యలో మావోయిస్టులకు ఇద్దరు స్థానిక టీడీపీ నేతల నుంచి పూర్తి సహకారం అందినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిలో ఒకరు మండలస్థాయి నేత కాగా, మరొకరు గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతగా పోలీసులు తెలుసుకున్నారు.

అలాగే వీరిద్దరిలో ఓ నేత గంజాయి, అక్రమ రవాణా లాంటి అసాంఘిక కార్యకలాపాల్లో కూడా వున్నారని తెలుస్తుంది. ఈ ఇద్దరూ కిడారికి అత్యంత నమ్మకస్థులుగా వ్యవహరిస్తూనే మావోయిస్టుల వ్యూహంలో పాలుపంచుకున్నట్టు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలో వారి పాత్రపై కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. జంట హత్యల్లో తమ పాత్ర ఉందని వారు విచారణలో వారు అంగీకరించిన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వీరి నుంచి మరిన్ని వివరాలు సేకరించి మరో రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశముంది. పథకం ప్రకారమే లివిటిపుట్టు గ్రామానికి కిడారిని రాబట్టి, మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకునేలా చేయడంలో వీరు క్రియాశీలకంగా వ్యవహరించినట్టు అంగీకరించారు. అయితే మావోలకు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? ఎప్పటి నుంచి వారితో సంబంధాలు ఉన్నాయి? ఎమ్మెల్యేపై వారికి వ్యక్తిగత కక్ష ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగింది.

అరకు ప్రాంతంలో కీలక నేతలుగా ఎదిగిన కిడారి, సోమల అడ్డుతొలగిస్తే రాజకీయంగా మరో నేత ఎదుగుదలకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారా? దీని వల్ల ప్రయోజనం ఎవరికి? తదితర అంశాలకు సంబంధించి అత్యంత కీలక విషయాలను పోలీసులు రాబట్టారని సమాచారం. కిడారిపై మావోయిస్టుల దాడికి రెండు, మూడు రోజుల ముందు ఎవరెవరి మధ్య ఫోన్ సంభాషణలు సాగాయి? ఆయనకు ఆ రెండు మూడు రోజుల్లో వరుసగా ఫోన్‌ చేసింది ఎవరు? అన్న వివరాలపై పోలీసులు దృష్టి సారించారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే సర్వేశ్వర రావు.. సర్రాయిలో గ్రామదర్శిని కార్యక్రమానికి బయల్దేరే ముందు ఆయనకు ఎక్కడెక్కడి నుంచి కాల్స్‌ వచ్చాయనే అంశంపై కాల్‌ డేటాను విశ్లేషించిన పోలీసులు.. కొన్ని అనుమానిత నెంబర్లను సేకరించినట్లు తెలుస్తోంది. కిడారికి ఫోన్‌ చేసిన ఎంతసేపటి తర్వాత వారి నుంచి ఇతరులకు ఫోన్లు వెళ్లాయి? ఆ నెంబర్లు ఎవరిని ఆరా తీయడంతో పై ఇద్దరి పాత్రకు సంబంధించి పక్కా ఆధారాలు లభించి వారిని అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Araku MLA  Kidari Sarveswara Rao  Somu  TDP  Maoists  andhra pradesh  crime  

Other Articles