SBI halves daily ATM cash withdrawal limit ఖాతాదారులకు బ్యాం‘కింగ్’ దిగ్గజం ఎస్బీఐ షాక్..

Sbi lowers atm cash withdrawal limit ahead of festive season

SBI, ATM WITHDRAWAL LIMIT, sbi atm withdrawal limit, PNB ATM withdrawal limit, demonetisation, debit card, debit card withdrawal limit, debit card, withdrawal, RBI

The State Bank of India (SBI) has lowered the ATM cash withdrawal limit to Rs 20,000 a day, from Rs 40,000.

ఖాతాదారులకు బ్యాం’కింగ్’ దిగ్గజం ఎస్బీఐ షాక్..

Posted: 10/01/2018 12:30 PM IST
Sbi lowers atm cash withdrawal limit ahead of festive season

భారతదేశ భ్యాం‘కింగ్’ దిగ్గజం.. ప్రపంచ అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా కొనసాగుతున్న భారతీయ స్టేట్ బ్యాంకు.. తమ ఖాతాదారులకు మరోమారు షాక్ ఇచ్చింది. సరిగ్గా దసరా, దీపావళి పండగ సీజన్లో తమ ఖాతాదారులు డబ్బులు విత్ర్ డ్రా చేసే అంశంలో పరిమితులను సగానికి సగం తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు నేపథ్యంలో చెప్పిన అవినీతి, నల్లధన కుబేరులు, పన్ను ఎగవేతదారులు ఇత్యాది కారణాలు ఏ ఒక్కటి తీరకపోయినా.. సరిగ్గా నవంబర్ 9 నుంచి మెదలైన కరెన్సీ నోట్ల కటకట మొదలైంది.

బడాబాబులకు లెక్కపత్రం లేకుండా అడిగి అడగంగానే రుణాలు ఇచ్చి.. వాటిని రాబట్టుకునే చర్యల్లో కూడా అంతా అయిపోయన తరువాత చేతులు కాల్చుకుంటున్న ఈ దిగ్గజబ్యాంకు.. సామాన్య ఖాతాదారులపై మాత్రం ఇప్పటికే మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో పెనాల్టీలను విధిస్తూ.. కోట్ల రూపాయలను వసూలు చేస్తూ తమ లొటును పూడ్చుకుంటున్న నేపథ్యంలో విమర్శలు వెల్లివిరిసినా.. పట్టించుకోని బ్యాంకు.. తాజాగా మరో నిర్ణయం తీసుకుని పండుగ వేళ తమ ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది.

ప్రస్తుం రోజుకు ఏటీఎం కార్డు నుంచి మాక్సిమమ్ (గరిష్ట) విత్ డ్రా లిమిట్ పరిమితి రూ.40,000 ఉండగా, తాజాగా దాన్ని రూ.20 వేలకు కుదిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ నిర్ణయం అక్టోబర్ 31 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. డిజిటల్ లావాదేవీలు పెంచాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ఉన్నతాధికారి తెలిపారు. ఏటీఎంల వద్ద నగదు విత్ డ్రా సందర్భంగా మోసాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో తాజా నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

బ్యాంకు నిబంధనల ప్రకారం క్యాష్ విత్ డ్రా లో మార్పులు చేస్తే 30 రోజుల ముందుగా కస్టమర్లుకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై అన్ని బ్యాంకు బ్రాంచీలకు ఇప్పటికే సమాచారం అందజేశామన్నారు. రూ.20 వేల కన్నా ఎక్కువ మొత్తంలో విత్ డ్రా చేసుకోవాలంటే అందుకు అనువైన మరో కార్డు కోసం కస్టమర్లు బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాంకు అధికారులు చెబుతున్న కారణాలతో మాత్రం ఖాతాదారులు అసంతృప్తిని కబనరుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI  ATM withdrawal limit  demonetisation  debit card  withdrawal  RBI  

Other Articles