Stalin discharged from hospital ఆసుపత్రి నుంచి విడుదలైన స్టాలిన్..

Dmk chief mk stalin discharged from hospital after minor surgery

MK Stalin apollo, MK stalin discharge, MK stalin minor surgery, DMK, Apollo Hospital, Minor surgery, Right Thigh, discharge, Chennai, Tamil Nadu

DMK President MK Stalin underwent a minor surgery on his thigh at a private hospital in Chennai in Tamil Nadu early on Thursday. He was admitted around midnight and was discharged by Thursday afternoon.

సర్జరీ తరువాత ఆసుపత్రి నుంచి విడుదలైన స్టాలిన్..

Posted: 09/27/2018 01:09 PM IST
Dmk chief mk stalin discharged from hospital after minor surgery

తమిళనాడులోని డీఎంకే పార్టీ అధినేత, ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్(65) చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత రాత్రి అనారోగ్యం బారిన పడిన స్టాలిన్.. అపోలో అసుపత్రిలో చికిత్స పొందారు. అస్వస్థతకు గురికావడంతో స్టాలిన్ ను బుధవారం అర్ధరాత్రి హుటాహుటిన అల్వార్ పేట్ ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలం నుంచి ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

స్టాలిన్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అపోలో అసుపత్రి.. స్టాలిన్ అరోగ్య విషయంలో ఎవరూ ఎలాంటి అందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన చిన్నసమస్యతో మాత్రమే వచ్చారని తెలపింది. అందుకుగాను స్టాలిన్ కుడి తొడకు మైనర్ సర్జరీ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.ఆ తరువాత రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని స్టాలిన్‌కు వైద్యులు సూచించారు.

డీఎంకే ప్రధాన కార్యదర్శి టీఆర్ బాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘స్టాలిన్ బుధవారం రాత్రి అస్వస్థతకు లోనుకావడంతో అపోల్ అసుపత్రికి తరలించాం. గత రెండు నెలలుగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోలేదు. దీంతో కుడి తోడ ఇబ్బంది పెట్టడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు చెప్పారని’ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MK Stalin  DMK  Apollo Hospital  Minor surgery  Right Thigh  discharge  Chennai  Tamil Nadu  

Other Articles