another call money case in vijayawada వివాహేతర సంబంధం నేరం కాదన్న సుప్రీం..

Adultery is not a crime section 497 of ipc unconstitutional sc

Adultery verdict, Supreme Court, five-judge Constitution bench, adultery supreme court, adultery menaing, adultery section, adultery cases, adultery section, adultery in ipc, adultery laws, section 497 ipc, section 497 of india penal code, section 497 ipc cases, section 497 supreme court, crime

The Supreme Court pronouncing its verdict on pleas challenging the constitutional validity of the Section 497 of Indian Penal Code, the top court in a majority verdict said "Section 497 is manifestly arbitrary, offends dignity of women."

వివాహేతర సంబంధాన్ని సమర్థించిన సుప్రీం..

Posted: 09/27/2018 12:34 PM IST
Adultery is not a crime section 497 of ipc unconstitutional sc

నా మొగుడు నాకే సోంతం అనే మహిళామణులు ఎందరో వున్నా.. వారిని కాదని అక్రమ సంబంధాలు పెట్టుకునే వారి సంఖ్య అధికం. అయితే అక్రమ సంబంధం బయటపడితే వెళ్లి పరస్త్రీపై దాడి చేస్తున్నారు అమె తరపు బంధువులు. అయితే నా భార్యపై పూర్తి హక్కులు నావే అనుకునే మగవారు కూడా లేకపోలేరు. అయితే ఆ కట్టుబాట్లను దాటి పర పురుషులతో వివాహేతర సంబంధాలను పెట్టుకునే అడవాళ్లు లేకపోలేదు. అయితే ఇలాంటి సంబంధాలు ఇకపై నేరంగా పరిగణించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది.

భారతదేశ వివాహ వ్యవస్థ భార్యభర్తల మధ్య విశ్వసనీయతతో కూడుకున్నదని, అంతమాత్రాన భార్య తన సొంతమని భర్తలు భావించడం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో వివాహేతర సంబంధాన్ని సుప్రీంకోర్టు నేరంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ బద్ధత, అడల్ట్రీపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో విచారణ జరిపిన జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్, ఈ సెక్షన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.

ఐపీసీ సెక్షన్ 497, ప్రస్తుత చట్ట నిబంధనలపై విచారణ చేసిన న్యాయస్తానం.. సెక్షన్ 497 పురాతనమైనదని, ఏకపక్షమైనదని అభిప్రాయపడింది. వివాహమైన పురుషుడు భార్యతో కాకుండా మరో స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదని న్యాయస్తానం చెబుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇదే విషయం మహిళలకు కూడా వర్తిస్తుందని, ఇద్దరి మధ్య పరస్పర అంగీకరాంతో జరిగే ఇష్టపూర్వక శృంగారం నేరం కాదని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం చెప్పింది.

ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యంగ విరుద్దమని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు.. సెక్షన్ 497తో మహిళలకు సమాన అవకాశాలను కాలరాస్తోందన్న పేర్కొంది. అయితే అనేక వివాహేతర సంబంధాలలో మహిళలను మాత్రమే బాధితురాళ్లను చేస్తున్నారని.. ఇలాంటి కేసుల్లో ఇద్దరిదీ సమాన బాధ్యతని ధర్మసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతమున్న 497 చట్టం బాధిత మహిళ వ్యక్తిత్వం కోల్పేయేలా ఈ చట్టం వుందని తెలిపింది. చట్టాల పేరుతో మహిళల వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లరాదని వారికి కూడా స్వేచ్చ ఉండాల్సిందేనని పేర్కొంది.

సమానత్వ హక్కులకు 497 చట్టం తూట్లు పడుస్తుందని తెలిపింది. ఇకపై సెక్షన్ 497 రాజ్యాంగ సమ్మతం కాదన్న సర్వోన్నత న్యాయస్థానం.. నైతిక విలువలతో పోలిస్తే, ప్రేమతో కూడిన విలువలకే ప్రాధాన్యత ఇస్తూ, ఈ తీర్పును ఇస్తున్నామని, పెళ్లైన వ్యక్తి మరొకరి భార్యతో శృంగారంలో పాల్గొంటూ పట్టుబడితే ఇద్దరూ శిక్షార్హులు కారని ఈ సందర్భంగా సీజే దీపక్ మిశ్రా తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adultery  supreme court  adultery section  adultery laws  section 497 ipc  ipc 497  

Other Articles