new railway line to AP capital Amaravati అమరావతికి కొత్త రైల్వే లైను.. అనుమతులే అలస్యం..

New railway line to ap capital amaravati scr gm vinodkumar

South Central Railway, SCR General Manager, SCR GM vinod kumar, new railway line to Andhra Pradesh capital Amaravti, new railway line Amaravti, Amaravti new railway line, Amaravati railway line, amaravati rail with 883 crores, AP MPs, TDP Mps meet

South Central Railway General Manager vinod kumar said that the railway department has sent a report regarding a new railway line to Andhra Pradesh capital Amaravti with Rs. 883 crores.

అమరావతికి రైల్వే లైను.. త్వరలో అనుమతులు..

Posted: 09/26/2018 12:00 PM IST
New railway line to ap capital amaravati scr gm vinodkumar

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే లైను కల నెరవేరబోతోంది. రూ.883 కోట్లతో రైలు మార్గం నిర్మాణానికి రైల్వే బోర్డుకు నివేదిక పంపినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌  మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌  తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనుమతులు వస్తాయని పేర్కొన్నారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల పరిధిలోని సమస్యలపై ఆయన వారితో భేటీ అయ్యారు.

ఈ క్రమంలో విశాఖ రైల్వే జోను అంశాన్ని లేవనెత్తిన టీడీపీ ఎంపీలు.. రైల్వే అధికారుల తీరును నిరసిస్తూ.. అందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైలు మార్గం నిమిత్తం తాము నివేదికలు పంపామని, అనుమతులు రావాల్సిందే అలస్యమని చెప్పారు. ప్రస్తుతం రెండు లైన్లకు సరిపడా భూసేకరణ జరుగుతుందని, తొలుత సింగిల్ లైన్ నిర్మిస్తామని, అనంతరం డిమాండ్‌ను బట్టి రెండో లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

వచ్చే రెండేళ్లలో దక్షిణమధ్య రైల్వే జోన్ మొత్తం విద్యుద్దీకరణ పనులు పూర్తవుతాయన్నారు. అలాగే, తిరుపతి రైల్వే స్టేషన్‌ను రూ.400 కోట్లతో పీపీపీ పద్ధతిలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. మార్చి 2019 నాటికి విజయవాడ, గుంటూరు, గుంతకల్ కర్నూలు రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునికీకరించనున్నట్టు తెలిపారు. విజయవాడ-విశాఖ మూడో లైన్, నడికుడి-శ్రీకాళహస్తి మార్గం పనులు వేగంగా జరుగుతున్నట్టు జీఎం వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Central Railway  GM vinod kumar  new railway line  Amaravti  TDP Mps meet  Andhra Pradesh  

Other Articles