Kerala violinist loses daughter in accident రోడ్డు ప్రమాదంలో సంగీత దర్శకుడి 2ఏళ్ల కూతురు మృతి

Musician balabhaskar injured child killed in accident

Musician Balabhaskar, Tejaswini, balabhaskar daughter, Lakshami, violinist, Road Accident, Thiruvananthapuram, malayalam music director, mollywood

The two-year-old daughter of noted violinist and music composer Balabhaskar was killed in a road accident, near Pallipuram, about 15 km from Thiruvananthapuram.

రోడ్డు ప్రమాదంలో సంగీత దర్శకుడి 2ఏళ్ల కూతురు మృతి

Posted: 09/26/2018 11:25 AM IST
Musician balabhaskar injured child killed in accident

మలయాళ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు బాలభాస్కర్ రెండేళ్ల కూతురు దుర్మణం పాలైంది. బాలభాస్కర్ ప్రయాణిస్తున్న కారు.. వేగంగా వెళ్లడం.. అదుపుతప్పి చెట్టుకి వేగంగా ఢీకోవడంతో అక్కడికక్కడే అతడి కూతురు తేజస్వి మరణించింది. ఆయన భార్య లక్ష్మీకూడా తీవ్రగాయాలు కావడంలో అమె కూడా ప్రస్తుతం జీవన్మరణాల మధ్య కోట్టుమిట్టాడుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న స్థానికులు అమెను హుటాహుటిన అస్పత్రికి తరలించారు.

కాగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కన్నకూతురు కళ్ళ ముందే చనిపోవడంతో బాలభాస్కర్ దంపతులు తీవ్ర షాక్ కి గురయ్యారు. దీనికి తోడు తన సహధర్మచారిణి అయిన ఆయన సతీమణి లక్ష్మీ పరిస్థితి కూడా విషమంగా వున్నా స్థిరంగా వుందని వైద్యులు తెలిపారు. వాయిలన్ వాయిద్య కళాకారుడిగా తన కెరీర్ ను ప్రారంభించి.. సంగీత దర్శకత్వంతో మాలీవుడ్ రంగంలో రాణించిన ఆయన కారు చెట్టును ఢీకొనగానే.. గుర్తుపట్టిన స్థానికులు వారిని అస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. రోడ్డు యాక్సిడెంట్ లో తనకు కూడా తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

ఈ ఘటన తిరువనంతపురం దగ్గరలోని పల్లిపురం రోడ్డుమార్గంలో సంభవించింది. త్రిస్సూర్ లోని దేవాలయానికి తెల్లవారుఝామున వెళ్లి దైవదర్శనం చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో అత్యంత వేగంగా వెళ్తూ ఓ చెట్టుని ఢీకొట్టింది కారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్న సమయంలో ఈ ఘోర సంఘటన జరిగింది.మలీవుడ్లో పలు చిత్రాలకు సంగీతం అందించిన బాలభాస్కర్ సింగర్ కూడా అయితే బాలబాస్కర్ తో పాటు అతడి భార్య లక్ష్మి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐ సి యు లో చికిత్స పొందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles