Vangaveeti Radha to Leave YSRCP వంగవీటి ఇంటి వద్ద ఉద్రిక్తత.. పెట్రోల్ బాటిళ్లతో అనుచరుల హల్ చల్

Vangaveeti radha confirmed to leave ysrcp future uncertain

Vangaveeti Radha, Vijayawada Central. Kapu Icon, Vangaveeti Ranga, Gautham Reddy, YSR Congress, TDP, JanaSena, Pawan Kalyan, Chandra babu, YS Jagan Mohan Reddy, Malladi Vishnu, PrajaRajyam, Andhra pradesh, Politics

Vangaveeti Radha is leaving YSR Congress after YS Jagan Mohan Reddy refused to give assurance about Vijayawada Central Ticket to him.

వంగవీటి ఇంటి వద్ద ఉద్రిక్తత.. పెట్రోల్ బాటిళ్లతో అనుచరుల హల్ చల్

Posted: 09/17/2018 03:34 PM IST
Vangaveeti radha confirmed to leave ysrcp future uncertain

బెజవాడ వైసీపీలో అసమ్మతి సెగ రాసుకుంది. విజయవాడ సెంట్రల్ సీటును కాంగ్రెస్ నుంచి వచ్చిన మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సంకేతాలను పంపిన క్రమంలో అదే సీటుపై అశలు పెట్టుకుని పనిచేస్తున్న వైసీపీ నేత వంగవీటి రాధా వర్గీయులు నిరసనకు దిగారు. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు సంకేతాలు వెలువడిన క్రమంలో ఆ సమావేశం నుంచి రాధా మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో ఆయన అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఆ సీటు నుంచే బరిలోకి దిగాలని రాధా భావిస్తుంటే.. విష్ణుకు పగ్గాలు ఇలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్ తీరుపై రాధా వర్గీయులు మండిపడుతున్నారు. సెంట్రల్ టికెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ.. ఆయన సోదరుడు, ఉయ్యూరు కౌన్సిల్, జిల్లా ఫ్లోర్ లీడర్ వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. మరికొందరు కూడా పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరైతే నగరంలోని వంగవీటి రంగా విగ్రహం దగ్గర నిరసనకు కూడా దిగారు. అలాగే వంగవీటి రాధా తన కుటుంబ సభ్యులు, అనుచరులతో సమావేశం నిర్వహించి.. ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట.

ఈ నేపథ్యంలో కొందరు వంగవీటి రాధా అభిమానులు మోహన రంగా విగ్రహం నుంచి వంగవీటి రాధా నివాసానికి చేరుకుని ఆక్కడ నిరసనకు దిగారు. అయితే వస్తూ వస్తూ చేతిలో పెట్రోల్ బాటిళ్లను తీసుకుని వచ్చిన అనుచరులు.. దానిని వంటిపై సోసుకుని.. ఆత్మహత్యాయత్నం చర్యలకు తాము సిద్దమంటూ చెప్పారు. ఇంతలో సమాచారం అందుకున్న రాధా.. వారిని వారించి.. పెట్రోల్ బాటిళ్లను చేతిలోంచి తీసుకున్నారు. ఇలాంటి చర్యలకు తాను పూర్తిగా వ్యతిరేకమని, ఇలాంటివి సహించనని వారిని వారించి సముదాయించారు. దీంతో అనుచరులు కూడా శాంతించారు.

మరోవైపు రాధాను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలు కొందరు.. రాధాకు ఫోన్ చేశారట. అలాగే వైసీపీ నేతలు యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకట్రావులు కూడా వంగవీటిని కలిసి బుజ్జగించినట్లు సమాచారం. సెంట్రల్ సీటు తలనొప్పిగా మారడంతో.. వైసీపీ మరో ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తెస్తోందట. రాధాను మచిలీపట్నం పార్లమెంట్ నుంచి బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ నిర్ణయంపై రాధా ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే వంగవీటి కోసం టీడీపీ నుంచి ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న వంగవీటి రాధాతో కొందరు టీడీపీలోకి టచ్‌లోకి వచ్చి... సంప్రదింపులు జరుపుతున్నారట. గతంలోనూ రాధాను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలు.. మళ్లీ ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సెంట్రల్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో.. ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అన్న కోణంలోనూ ఆలోచిస్తున్నారు. అలాగే వంగవీటి తీసుకునే నిర్ణయాన్ని బట్టి అడుగులు వేయాలని టీడీపీ భావిస్తోందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles