Petrol and diesel prices hiked again వాహనదారులకు చుక్కలే.. ఇంధన ధరలు పైపైకే..

Petrol just a shade under rs 90 litre diesel costlier too

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Petrol prices continued to soar to fresh record highs on Monday, and were selling at above Rs 91 in few cities across Maharashtra. In the state’s city Parbhani, one litre of petrol is now selling at Rs 91.19. We take a closer look.

వాహనదారులకు చుక్కలే.. ఇంధన ధరలు పైపైకే..

Posted: 09/17/2018 12:55 PM IST
Petrol just a shade under rs 90 litre diesel costlier too

పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ రికార్డును చేరినా.. వాటి ధరాఘాత రికార్డులను అవే తుడిపెట్టుకుపోతున్నా.. అటు కేంద్రం, ఇటు ఇంధన కంపెనీలు మాత్రం తమ చేతుల్లో ఏమీ లేనట్లుగా.. వాహనదారుల పర్సులను ఖాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చోద్యం చూస్తున్నాయి. ఆల్ టైం రికార్డ్ ను ఇప్పటికే అధిగమించిన ఇంధన ధరలు.. ఇక సెంచరీకి చేరువగా దూసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాయా అన్న అనుమానాలు కూడా వాహనదారుల్లో ఉత్పన్నమవుతుంది. అయితే ధరలు ఇలానే పెరుగుతూ పోతే మరో నెల రోజుల్లోపు ఆ ముచ్చటా తీరిపోనుంది.

మే 14 నుంచి పెరుగుతున్న ఇంధన ధరలు మధ్యకాలంలో కాసింత ఊరటను కల్పించినా.. మళ్లీ విజృంభించి శతకం దిశగా పయనిస్తుంది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.87కి చేరింది. ఇది సరికొత్త ధర. అదే విధంగా డీజిల్ అయితే రికార్డ్స్ బ్రేక్ చేస్తూ లీటర్ రూ.80కి చేరింది. డీజిల్ రేటు అయితే ఇండియా చరిత్రలో అత్యధిక ధర ఇది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయని దీనికి తామేం చేయలేమని చెబుతున్న కేంద్రం.. నాలుగేళ్లుగా ధరలు తగ్గిన క్రమంలో విధించిన ఎక్సైజ్ డ్యూటీని కూడా తగ్గించడంలో ఇంకా మీనమేషాలు లేక్కించడమేంటని వాహనదారులు భగ్గుమంటున్నారు.

తాజాగా పెరిగిన ధరలతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.44, డీజిల్ రూ.77.58లతో ఆల్‌టైమ్ రికార్డుకు చేరింది. ఇక రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.82.06, డీజిల్ రూ.73.78.. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.85.88, డీజిల్ రూ.78.98.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధరలు రూ.86.82, డీజిల్ రూ.78. 28గా ఉన్నాయి. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles