Honour killer photo with TRS mantri kicks up row నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యేపై అమృత ఆరోపణలు

Pranay s widow accuses trs mla vemula veeresham

pranay murder case, maruthi rao, shravan, congress leader, kareem, Nakrekal MLA, Vemula Veeresham, miryalaguda, crime

Amruthavarshini wife of Perumalla Pranay blamed Nakrekal MLA Vemula Veeresham for being a helping hand to Maruthi Rao in executing the murder plan.

ప్రణయ్ హత్యకేసు: నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యేపై అమృత ఆరోపణలు

Posted: 09/17/2018 12:06 PM IST
Pranay s widow accuses trs mla vemula veeresham

తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ పరువుహత్య కేసులో రాజకీయ నేతల జోక్యం కూడా వుందన్న వార్తలను వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురు ప్రణయ్ తో వివాహం చేసుకున్న తరుణంలో దానిని జీర్ణంచుకోలేని మారుతిరావు.. తన అంగబలం, అర్థబలంతో పాటు తన అల్లుడిని హత్య చేయించాలని ముందస్తుగానే ప్రణాళికను రచించుకున్నాడని, అందుకు అనుగూణంగానే ఆయన అధికార పార్టీలో చేరి రాజకీయ బలాన్ని కూడా కూడగట్టుకునే ప్రయత్నం చేశాడని దళిత సంఘాలు నుంచి అరోపణలు వస్తున్నాయి.

ఈ క్రమంలో ముందుగా కాంగ్రెస్ మిర్యాలగూడ అధ్యక్షుడు కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత కరీం సహా మారుతీరావు, శ్రావణ్ కుమార్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ భార్య అమృత తండ్రి తిరునగరు మారుతీరావు ఏ1 నిందితుడు, అతడి సోదరుడు శ్రావణ్ కుమార్ ఏ2 నిందితుడిగా పేర్కొన్న పోలీసులు కరీం సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రణయ్‌పై కత్తితో దాడిచేసిన నిందితుడి కోసం రెండు ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

కాగా, హత్యనంతర పరిణామాలను కూడా ముందే అంచనా వేసిన మారుతిరావు ఆయన సోదరుడు శ్రావణ్.. తప్పించుకునేందుకు రాజకీయ అండ వెతుకున్నట్టు తెలుస్తోంది. ఆర్నెళ్ల క్రితమే మంత్రి కేటీఆర్ సమక్షంలో మారుతీరావు అధికార పార్టీలో చేరారని, మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మారుతీరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ఆయనతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

కాగా, ప్రణయ్‌ని హత్య చేయించడంలో అధికార పార్టీకి చెందిన నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు భావిస్తున్నానని బాధితురాలు అమృతవర్షిణి అరోపించింది. తన తండ్రి మారుతీరావు వద్ద డబ్బులు తీసుకుని కిరాయి హంతకులను రప్పించి, మిర్యాలగూడలో వాళ్లు ఉండడానికి ఎమ్మెల్యే సాయం చేశాడని అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఆయన రాజీ కుదిర్చేందుకు కూడా ప్రయత్నించారని పేర్కొంది.

పెళ్లైన తరువాత కొన్ని రోజులకు తనను, ప్రణయ్‌ని రమ్మని ఆయన పిలిచారని, వెళ్లకపోయేసరికి ప్రణయ్ తండ్రిపై అక్రమ కేసు పెట్టించారని మీడియాకు అమృత చెప్పింది. తన తండ్రితో సహా హత్యతో ప్రమేయమున్న వారందరికీ ఉరి శిక్ష వేయాలని ఆమె డిమాండ్ చేసింది. అమాయకుడైన తన భర్తను చంపిన వారిని, అంతకంటే ఘోరమైన రీతిలో చంపితేనే మరోసారి ఇలాంటి ఘటనలు జరగవని భోరున విలపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pranay murder case  maruthi rao  shravan  kareem  Vemula Veeresham  miryalaguda  crime  

Other Articles