పోలీసులు అంటే కరుగ్గా ఉంటారనీ, సామాన్యులతో దురుసుగా ప్రవర్తిస్తారని చాలామంది సామాన్యులలో వున్న భావన. అయితే ఇలా కొందరు వ్యవహరించడంతోనే అందరూ అలానే వుంటారని అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. కానీ పోలీసులంటే అలానే కాదని మనవత్వం పరిమళించిన మహానుభావులు కూడా వుంటారని.. మరికొందరు పోలీసులు అప్పడప్పుడూ నిరూపిస్తూ.. వార్తల్లో వ్యక్తులుగా మారుతుంటారు.
ఇలాంటి ఓ పోలీస్ అధికారి ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సరికొత్త బాష్యం చెప్పాడు. తన చొరవతో నిండు గర్భిణిని అస్పత్రిలో చేర్పించాడు. తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడాడు. అదెలా అంటే.. ఉత్తర్ ప్రదేశ్ ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ లో సోనూకుమార్ రాజోరా పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్ జిల్లా బల్లభ్ గఢ్ గ్రామానికి చెందిన మహేశ్ తన భార్య భావన కాన్పు చేయించడం కోసం రైలులో బయలుదేరారు. రైలు మధుర కంటోన్మెంట్ వద్దకు చేరుకోగానే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి.
దీంతో స్టేషన్ లో దిగిపోయిన మహేశ్ సాయం చేయాలని పలువురిని అర్థించాడు. ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పోలీస్ అధికారి సోనూకుమార్ వద్దకు వెళ్లాడు. వెంటనే స్పందించిన సోనూ కుమార్ అక్కడకు వచ్చి అంబులెన్సుకు ఫోన్ చేశాడు. వాహనం అందుబాటులో లేదని జవాబు రావడంతో భావనను చేతులతో ఎత్తుకుని 100 మీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించడంతో భావన పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది.
ప్రస్తుతం తల్లీబిడ్డల ఆరోగ్యం స్థిరంగా ఉంది. కాగా సోనూకుమార్ కు ఈ సందర్భంగా మహేశ్-భావన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయమై సోనూకుమర్ మాట్లాడుతూ.. ‘నేను నా విధిని మాత్రమే నిర్వర్తించాను. అంబులెన్సు లేకపోవడంతో ఆమెను ఆసుపత్రి వరకూ మోసుకెళ్లాను’ అని సోనూకుమార్ తెలిపారు. కాగా, ఓ పోలీస్ అధికారిగా సోనూకుమార్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more