2019 సార్వత్రిక ఎన్నికలు హాట్ టాఫిక్‌గా మారగా, మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కితున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే ముఖ్యమంత్రి పదవికి ఎవరు దక్కించుకుంటారనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. దీంతో సర్వేలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఓ వైపు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే అంటూ.. మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు మళ్లీ పట్టం కడతారని, ఇక ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే ముఖ్యమంత్రి పీఠం దక్కనున్నట్లు ఈ సర్వేలో తేలింది. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వేలో వెల్లడి అయింది. అంతేకాకుండా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కంటే వైఎస్ జగన్‌కే ప్రజాదరణ ఎక్కువ ఉన్నట్లు సర్వే పేర్కొంది.
హుషారుగా వీస్తున్న ఫ్యాను ..
ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ప్రజలు తమ అభిప్రాయాన్ని సర్వే ద్వారా స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిత్వం విషయానికొస్తే వైఎస్ జగన్ మోహ న్‌రెడ్డికి 43%, చంద్రబాబు నాయుడుకు 38%, జనసేన నేత పవన్ కళ్యాణ్‌కు 5% మద్దతు ప్రకటించారు. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 10,650 మంది అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ సర్వేపై శుక్రవారం రాత్రి ఇండియా టుడే ఛానెల్‌లో ‘పొలిటికల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై చర్చ జరిగింది.
సర్వే సానుకూలంగా రావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం ఈ సర్వే ఫలితాలను కొట్టిపారేసింది. రాబోయే ఎన్నికల్లో కూడా తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి సర్వేలు అనేకం వచ్చాయని, అయితే సర్వేల ఫలితాలను తిరగరాస్తూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని పార్టీ శ్రేణులు అయితే ఈ ట్రెండ్ ఎన్నికల వరకూ కొనసాగుతుందో లేదో చూడాలంటే ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చేవరకూ వేచి చూడాల్సిందే.
తెలంగాణలో జోరందుకున్న కారు..
తెలంగాణలో మళ్లీ గులాబీ గుభాళించనుంది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టనున్నట్లు ఈ సర్వేలో తేలింది. తెలంగాణ అసెంబ్లీని ఎనిమిది నెలల ముందుగానే రద్దు చేసి ముందస్తుకు సిద్ధమైన కేసీఆర్ కారులో దూసుకుపోతున్నారు. తదుపరి సీఎంగా కేసీఆర్‌కు 43 శాతం మంది మద్దతు తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌కు 18శాతం మంది మొగ్గు చూపారు. తెలంగాణలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలో జరిగిన ఈ సర్వేలో మొత్తం 7,110మంది పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more