maruthi rao arrested in pranay murder case ‘ఔను.. నేనే హత్య చేయించా’: మారుతిరావు

Miryalaguda honour killing accused maruthi rao arrested in pranay murder case

nalgonda honour killing,telangana honour killing,Telangana,nalgonda stabbing,nalgonda news,Nalgonda Murder,nalgonda,honour killing, honour killing, Inter-caste Marriage, miryalaguda, Nalgonda, telangana, crime

Maruthi Rao, father of Amrutha varshini and his brother shravan has been arrested in his nephew, a dalit youth who married his daughter was stabbed to death in front of his wife, was arrested by Golconda Police.

‘ఔను.. నేనే హత్య చేయించా’: అమృత తండ్రి మారుతిరావు

Posted: 09/15/2018 12:36 PM IST
Miryalaguda honour killing accused maruthi rao arrested in pranay murder case

సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రభుత్వ అసుపత్రి ఎదుట జరగిన దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసులో తన నేరాన్ని అంగీకరించాడు అమృత వర్షిణి తండ్రి మారుతీరావు. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడం తనకు నచ్చలేదని, అందుకనే తాను అతడ్ని హత్య చేయించేందుకు పది లక్షల సుపారీ ఇచ్చానని కూడా అంగీకరించాడు. ప్రణయ్ హత్య కేసు అనంతరం పరారీలో వున్న మారుతిరావుతో పాటు అతడి సోదరుడు శ్రావణ్ లను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా అల్లుడు ప్రణయ్ ను తానే హత్య చేయించానని మారుతీరావు అంగీకరించాడు. కూతురి ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక ...కిరాయి హంతకుడికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కోన్నట్లు తెలుస్తుంది. మిర్యాలగూడకు చెందిన పెనుమాళ్ల ప్రణయ్ ఎనమిది నెలల క్రితం హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో అమృత వర్షిణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అమృత గర్భవతి. ఆమెను ఆస్పత్రిలో చూపించి ఇంటికి వెళుతుండగా ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే.

అయితే ప్రణయ్ ను హతమార్చేందుకు అతడి ఇంటి వద్దే పలుమార్లు కిరాయి హంతకుడు... రెక్కీ నిర్వహించినా అది సాధ్యపడలేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయింది. దీంతో హత్య జరిగే రోజు ఉదయం కూతరు అమృతతో ఫోన్ ద్వారా మాట్లాడిన మారుతిరావు.. అమెతో ఎంతో చక్కగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. దీంతో మిర్యాలగూడ అసుపత్రికి వెళ్తున్న విషయాన్ని తన తండ్రికి చెప్పింది అమృత. అదే అమె పాలిట శాపంగా మారింది. దీంతో సుపారి వ్యక్తులకు సమాచారం అందించాడు మారుతిరావు. పథకం ప్రకారం అక్కడి చేరుకున్న అగంతకుడు.. వెనుకగా వెళ్ళి ప్రణయ్ ను అత్యంత దారుణంగా నరికి చంపాడు.

కళ్లెదుటే భర్త దారుణంగా హత్యకు గురి కావడంతో అమృతవర్షిణి షాక్‌కు గురి అయింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. కాగా విదేశాల్లో ఉన్న సోదరుడు వచ్చాక ప్రణయ్  అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు ప్రణయ్ హత్యకు నిరసనగా దళిత సంఘాలు మిర్యాలగూడ బంద్ చేపట్టాయి. మారుతీరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. బంద్ నేపథ్యంలో నగరంలోని దుకాణాలు, షాపులు మూతపడ్డాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honour killing  Inter-caste Marriage  miryalaguda  Nalgonda  telangana  crime  

Other Articles