Auto kills 5-year-old at Uppal నగరంలో విషాదం.. అటు అర్టీసీ బస్సు.. ఇటు అటో..

Three killed as tsrtc bus run over them at a bus stop

Auto, treatment, fiveyearold boy died, hospital, road accident, Uppal, Road Accident, Hyderabad, Bus accident, State bus accident, road accident, gachibowli cross roads, 3 killed, gachibowli road accident, gachibowli, TSRTC bus, Road Accident, hyderabad, Telangana, Crime

Three people were killed near Gachibowli cross roads after being hit by a metro TSTRC bus today. The bus was heading to Lingampally from Koti. A five-year-old boy died in a road accident after an auto rammed into his family at Ramanthapur near Uppal.

ITEMVIDEOS: నగరంలో విషాదం.. అటు ఆర్టీసీ బస్సు.. ఇటు ఆటో..

Posted: 09/10/2018 04:06 PM IST
Three killed as tsrtc bus run over them at a bus stop

హైదరాబాద్ మహానగరంలోని ఈశాన్య, నైరుతి ప్రాంతాల్లో విషాదం అలుముకుంది. నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గచ్చిబౌలి చౌరస్తాలో ఇవాళ ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించి ముగ్గురి జీవితాలను అర్థంతరంగా చిదిమేయగా, మరో ఘటనలో ఉప్పల్ కు చేరువలోని రామంతపూర్ లో దుకాణం నుంచి తన తండ్రి చేయి పట్టుకుని ఇంటికి వెళ్తున్న ఓ ఐదేళ్ల చిన్నారి జీవితాన్ని మృత్యుశకటంలా వచ్చిన అటో చిదిమేసింది.

గచ్చిబౌలిలోని ఘటనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి నుంచి కోఠి వెళ్తోంది. ఉదయం 8 గంటల సమయంలో గచ్చిబౌలి చౌరస్తా వద్దకు చేరుకున్న బస్సు మరో బస్సును తప్పించబోయి రోడ్డు దాటుతున్న పాదచారుల పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో దశరథ్‌ అనే ఆటో డ్రైవర్‌ కూడా ఉన్నాడు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం పోలీసలుఉ విచారణ చేపట్టారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

ఇక మరో ఘటనలో ఉప్పల్ పొలిస్ స్టేషన్ పరిధిలో ఆటో ఢీకొన్ని ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. పూర్తిగా మద్యం మత్తులో వున్న అటో డ్రైవర్ తన అటోపై నియంత్రణ కొల్పోవడంతో రామంతాపూర్ శారదనగర్ కాలనీకి చెందిన ఉమేష్ భార్య పిల్లలతో కలిసి షాపింగ్ కు వెళ్లాడు. రోడ్డుపై నడుస్తుండగా వేగంగా వస్తున్న ఆటో వీరిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఉమేష్ కు స్వల్పగాయాలవ్వగా... చిన్నారి మోహిత్ కు తీవ్రగాయాలయ్యాయి.  దీంతో మోహిత్ ను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న బైక్ ను తప్పించే క్రమంలో ఆటోడ్రైవర్ వాహనాన్ని పక్కకు తీసుకురావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆటోడ్రైవర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gachibowli cross roads  uppal  RTC Metro bus  Auto  accident  hyderabad  crime  

Other Articles