NIA court sentences life to one, death to 2 convicts జంట పేలుళ్ల కేసులో దోషులకు శిక్షలు ఖరారు..

Hyderabad twin blast verdict nia court sentences life to one death to 2 convicts

NIA court, Sentences, Tarik Anjum, perpetrators, Hyderabad blasts, punishment, terror operatives, gokul chat, lumbini park, Judge Srinivas Rao, Aneeq Shafique Sayeed, Mohammed Akbar Ismail Chowdhari, Farooq Sharfuddin Tarkash, Mohammed Sadiq Israr Ahmed Shaik, Cherlapalli Central Prison, crime

hyderabad twin blast verdict case: NIA court sentences life senternce to the one who has given shelter to two convicts, and death sentence to 2 convicts.

జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి ఉరి, ఒకరికి యావజ్జీవం..

Posted: 09/10/2018 06:07 PM IST
Hyderabad twin blast verdict nia court sentences life to one death to 2 convicts

శాంతిసామరస్యాలకు ప్రతికగా నిలుస్తూ.. భారత దేశ రెండో రాజధానిగా బాసిల్లేందుకు అన్ని అర్హతలు సంపాదించిన హైదరాబాద్ మహానగరం.. శరవేగంగా అభివృధ్దిలో పరుగులు తీస్తున్న క్రమంలో జరిగిన జంటపేలుళ్ల కేసు పెను విషాధాన్ని నింపింది. 2007లో ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబినీ పార్క్ లో జరిగిన పేలుళ్ల ఘటనలో జరిగిన ఈ జంటపేలుళ్ల కేసులో 44 మంది అసువులు బాయగా, అరవైకి పైగా మంది క్షతగాత్రులుగా మారారు. ఇప్పటికీ ఈ బాధితుల్లో కొందరు జీవచ్ఛవాలుగానే బతుకులీడుస్తూ.. న్యాయస్థానంలో తమకు న్యాయం జరగాలని ఉత్కంఠగా గత పదకొండేళ్లుగా నిరీక్షిస్తున్నారు.

ఎట్టకేలకు వారి నిరీక్షణకు న్యాయస్థానం తెరదించుతూ ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇప్పటికే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఇద్దరిని నిర్ధోషులుగా పరిగణించిన న్యాయస్థానం వారిని విడిచిపెట్టగా, మరో ఇద్దరిని మాత్రం దోషులుగా నిర్థారించిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ ఉదయం నిందితులకు ఆశ్రయం కల్పించిన మరో నిందితుడిని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. దోషులకు ఆశ్రయం కల్పించిన తారిఖ్ అంజుమ్ ను దోషిగా తేలుస్తూ ఇవాళ తీర్పును వెలువరించింది.

దీంతో ఈ కేసులో దోషుల సంఖ్య మూడుకు చేరింది. గత వారం ఏ-1 నిందితుడు అనీక్ షరీఫ్, ఏ-2 నిందితుడు అక్బర్ ఇస్మాయిల్ లను కోర్టు దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా కొద్ది సేపటి క్రితం ఈ ముగ్గురు దోషులకు ప్రత్యేక కోర్టు శిక్షను ఖరారు చేసింది. 44 మంది మరణాలకు కారణమైన ఏ1, ఏ2 నిందితులకు ఉరిశిక్షను విధిస్తూ శిక్షను ఖారారు చేసింది. కాగా, దోషులకు ఆశ్రయం కల్పించిన తారిఖ్ అంజుమ్ కు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అయితే న్యాయస్థానం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బాధిత కుటంబాలు.. ఈ కేసులో వున్న అందరి నిందితులకు శిక్షలు పడటంతోనే తమకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad blasts  NIA court  Sentences  Tarik Anjum  death senctence  crime  

Other Articles